హిందువులు హలాల్ మాంసం తినొద్దు.. - కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ (Union Rural Development Minister Giriraj Singh) అన్నారు. హలాల్ మాంసాన్ని (halal meat) మాత్రమే ముస్లింలు తింటారని, అలాగే హిందువులు కూడా జట్కా మాంసాన్నే (jhatka meat) తినాలని సూచించారు.
హిందువులు హలాల్ మాంసం తినడం మానేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. హలాల్ కు బదులు బ్లేడ్ దెబ్బతో వధించే విధానమై ‘జట్కా’ మాంసాన్ని తినాలని సూచించారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన బెగుసరాయ్ లో ఆదివారం పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హలాల్ మాంసం తిని తమ ధర్మాన్ని చెడగొట్టబోమని మద్దతుదారులతో ప్రతిజ్ఞ చేయించారు.
కదులుతున్న బస్సులో దళిత యువతిపై గ్యాంగ్ రేప్..
అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. హలాల్ మాంసం మాత్రమే తినే ముస్లింలను తాను అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఇప్పుడు హిందువులు కూడా తమ మత సంప్రదాయాల పట్ల అదే విధంగా నిబద్ధతను ప్రదర్శించాలని చెప్పారు. ‘‘హిందూ వధ పద్ధతి జట్కా. హిందువులు 'బలి' (జంతుబలి) చేసినప్పుడల్లా వారు దానిని ఒకే దెబ్బతో చేస్తారు. అందుకే హిందువులు హలాల్ మాంసం తిని తమను తాము కలుషితం చేసుకోకూడదు. హిందువులు ఎప్పుడూ జట్కాకు కట్టుబడి ఉండాలిఈ’’ అని ఆయన అన్నారు.
జట్కా మాంసం మాత్రమే విక్రయించే కబేళాలు, దుకాణాలు ఉండేలా కొత్త వ్యాపార నమూనా అవసరాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నొక్చి చెప్పారు. కాగా.. ఇదే విషయంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కొన్ని వారాల కిందట గిరిరాజ్ సింగ్ లేఖ రాశారు. అందులో పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. 'హలాల్' అని ముద్రపడిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలని కోరారు.
బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఏడు మండలాలను కోల్పోయాం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఇటీవల పార్లమెంటులో జరిగిన భద్రతా ఉల్లంఘనపై రాహుల్ గాంధీ ఆలస్యంగా స్పందిస్తూ.. నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ఈ ముడిపెట్టడాన్ని తప్పుపట్టారు. 'తుక్డే తుక్డే' గ్యాంగ్ పట్ల రాహుల్ గాంధీ సానుభూతి వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. గతంలో జేఎన్ యూ క్యాంపస్ లో దేశద్రోహ నినాదాలు చేసిన వారికి ఆయన సంఘీభావం తెలిపారని ఆరోపించారు.