Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న బస్సులో దళిత యువతిపై గ్యాంగ్ రేప్..

కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం (gang rape on moving bus)జరిగింది .కాన్పూర్ నుంచి జైపూర్ (kanpur - jaipur) వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన ఓ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Dalit girl gang-raped in moving bus..ISR
Author
First Published Dec 17, 2023, 8:31 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ నిర్భయ తరహా ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ దళిత యువతిపై కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఆ బస్సు డ్రైవర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కాన్పూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

‘ఎన్డీటీవీ’ కథనం, బస్సీ ఏసీపీ ఫూల్ చంద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 9, 10 తేదీల్లో రాత్రి 7.30 గంటల సమయంలో కాన్పూర్ నుంచి జైపూర్ వెళ్తున్న ఓ బస్సుల్లో 20 ఏళ్ల దళిత యువతి ఎక్కింది. అయితే బస్సులో సీటు లేకపోవడంతో ఆమె డ్రైవర్ క్యాబిన్ లో కూర్చోబెట్టారు. క్యాబిన్ లోపల మహ్మద్ ఆరిఫ్, లలిత్ అనే డ్రైవర్లతో పాటు ఇతర ప్రయాణికులు ఉన్నారు. 

కొంత సమయం తరువాత క్యాబిన్ లోని ప్రయణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ క్యాబిన్ డోర్ మూసివేసి, బస్సు కదులుతుండగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వంతుల వారీగా ఇద్దరు డ్రైవర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు అనుమానం వచ్చింది. 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..

వెంటనే క్యాబిన్ డోర్ తెరిచి చూశారు. అప్పటికే ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రయాణికులు ఆ డ్రైవర్లను అక్కడే చితకబాదారు. ఈ క్రమంలో లలిత్ అక్కడి నుంచి పారిపోయారు. అరిఫ్ ను మాత్రం ప్రయాణికులు బంధించారు. అనంతరం ప్రయాణికులు ఆ బస్సును సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గరకు తీసుకెళ్లారు. 

మంత్రి పదవి కోసమే హరీష్‌రావుపై జీవన్‌రెడ్డి విమర్శలు - దేశపతి శ్రీనివాస్‌

బాధితురాలి మామకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. డ్రైవర్లలో ఒకరిని మహ్మద్ ఆరిఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో డ్రైవర్ అయిన లలిత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2012లో ఇదే నెలలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది. ఆ ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కొంత కాలం తరువాత పరిస్థితి విషమించి మరణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios