Asianet News TeluguAsianet News Telugu

హింస, హత్య, వివక్షకు హిందుత్వ మద్దతిస్తుంది- కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, హిందుత్వకు వ్యతిరేకం అని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య అన్నారు. హిందుత్వ హింసను, హత్యలను, విభజనను ప్రోత్సహిస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Hinduism supports violence, murder and discrimination- former Karnataka CM Siddaramaiah's controversial comments
Author
First Published Feb 6, 2023, 2:56 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, హిందుత్వ వ్యతిరేకిని అని అన్నారు. హిందుత్వ హింసను, హత్యలను, విభజనను ప్రోత్సహిస్తుందని అన్నారు. హిందుత్వం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. హిందుత్వ హిందూ మతం కంటే భిన్నమైనదని, తాను స్వయంగా హిందువునేనని, కానీ మనువాద, హిందుత్వకు తాను వ్యతిరేకమని ఆయన అన్నారు. ను హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కలబుర్గిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బయోపిక్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.

డ్రైవర్ కు గుండెపోటు, అదుపుతప్పిన స్కూలుబస్సు.. స్టీరింగు తిప్పి, పెనుప్రమాదం తప్పించిన విద్యార్థిని..

అయితే ఈ ప్రకటనపై వివాదం నెలకొంది. బహుశా మనలో చాలా మంది హిందుత్వకు వ్యతిరేకమే తప్ప హిందూ మతానికి వ్యతిరేకం కాదన్నారు. ఏ మతంలోనైనా హత్యలు, హింసకు ఆస్కారం ఉందా అని ప్రశ్నించారు. అయితే హిందుత్వ, మనువాదంలో హత్యలు, హింస, విభజనకు ఆస్కారం ఉందని అన్నారు. 

భార‌త్ ప్ర‌కాశాన్ని ఏ మ‌హ‌మ్మారి, ఏ యుద్ధ‌మూ ఆప‌లేదు.. : ఇండియా ఎనర్జీ వీక్ లో ప్ర‌ధాని మోడీ

అయితే హిందుత్వపై సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జనవరి 8న కూడా ఆయన హిందువునని, అయితే హిందుత్వానికి వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

‘‘నేను హిందువును. నేను హిందూ వ్యతిరేకిని ఎలా కాగలను ? హిందుత్వ, హిందూ విశ్వాసాల చుట్టూ ఉన్న రాజకీయాలకు నేను వ్యతిరేకం. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానమే’’ అని సిద్ధరామయ్య తెలిపారు. తాను హిందూ వ్యతిరేకినన్న బీజేపీ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  అయితే గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి గతంలో ఆయనను ‘సిద్దరాముల్లా ఖాన్’ అంటూ అభిర్ణించారు.

అయితే వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రిటైర్మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని సిద్ధరామయ్య ఆదివారం తెలిపారు. మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2023 మేలోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక శాసనసభ పదవీకాలం 2023 మే 24తో ముగియనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios