బుల్లి బాయ్ యాప్ ప్రకంపనలు ఇంకా వస్తూనే ఉన్న తరుణంలో మరో విస్మయకర వార్త వెలుగులోకి వచ్చింది. బుల్లి బాయ్ యాప్.. ముస్లింల మహిళలను లక్ష్యం చేసుకోవడానిి ఈ కుట్ర అంతా అని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, హిందూ మహిళలనూ లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫేస్‌బుక్ పేజీలు, టెలిగ్రామ్ చానెళ్లు నడుపుతున్నారని కొందరు ఆరోపించారు. కేంద్రం చర్యలకు దిగినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: ముస్లిం మహిళ(Muslim Women)లను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలను బుల్లి బాయ్(Bulli Bai) అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని, తద్వారా ముస్లిం మహిళల చిత్రాలను ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఫొటోలను వేలం వేయడం, వారిని అవమానపరచడం లక్ష్యంగా బుల్లి బాయ్ వెబ్‌సైట్ నడిచిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సహా ప్రభుత్వాలు, పోలీసలూ స్పందించాయి. వెంటనే నిందితుల అరెస్టుకు పోలీసులు పూనుకున్నారు. ఈ కేసు వివరాలు ఇంకా పూర్తిగా రాలేవు. అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. హిందు మహిళలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫేస్‌బుక్ పేజీలు(Facebook Pages), టెలిగ్రామ్(Telegram Channel) యాప్‌లో చానెళ్లు ఉన్నట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి.
కొన్ని ఫేస్‌బుక్ పేజీలు, టెలిగ్రామ్ చానెళ్లు హిందు మహిళల ఫొటోలను షేర్ చేస్తున్నాయని, వారిపై వేధింపులకు పాల్పడుతున్నాయని యూట్యూబర్ అన్షుల్ సక్సేనా ఆరోపణలు చేశారు. జూన్ 2021లో ఆ టెలిగ్రామ్ చానెల్‌ను సృష్టించినట్టు తెలిపారు. ఈ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వంపై కూడా స్పందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ బుధవారం స్పందించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆ చానెళ్లను తొలగించినట్టు తెలిపారు. ‘ఆ చానెళ్లను బ్లాక్ చేశాం. వారిపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసులతో సమన్వయంలో ఉన్నది’ అని వివరించారు.
Also Read: Bulli Bai app case: బుల్లీ బాయ్ యాప్ కేసు.. కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. మెటా సంస్థకు ఈ అంశంపై సమాచారం ఇవ్వాలని సంబంధిత బృందానికి ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వాటిని తొలగించాలని ఆదేశాలూ ఇవ్వాలని సూచించినట్టు వివరించారు.
ఇప్పటికే బుల్లి బాయ్ యాప్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన ఫొటోలను బుల్లి బాయ్ అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని, తనను లక్ష్యం చేసుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మహిళా ముస్లింలను అబ్యూజ్ చేయడానికే బుల్లి బాయ్ యాప్ ఉపకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఢిల్లీ, ముంబయి పోలీసుల దగ్గర కేసు నమోదైంది.
Also Read: Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మకానికి అమ్మాయిలు.. యాప్‌లో ఓ వర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !
బుల్లీ బాయ్ యాప్‌తో సంబంధం ఉన్న ఓ మహిళను పోలీసులు ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇదివరకే బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైకి తరలించారు. అతడిని విశాల్ కుమార్‌గా గుర్తించారు.
అయితే విశాల్ కుమార్, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న మహిళ.. ఇద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ‘ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళకు బుల్లి యాప్‌కు సంబంధించి మూడు అకౌంట్లను నిర్వహిస్తుంది. మరో నిందితుడు విశాల్ కుమార్ బుల్లీ బాయ్ యాప్‌లో Khalsa supremacist పేరుతో అకౌంట్ తెరిచాడు. డిసెంబర్ 31న అతడు ఇతర ఖాతాల పేర్లను సిక్కు పేర్లను పోలి ఉండేలా మార్చాడు. నకిలీ Khalsa ఖాతాదారులను చూపించాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.
