పాకిస్తాన్‌లో ఓ హిందూ మహిళను అతి దారుణంగా చంపేశారు. ఆమె తలను నరికేశారు. చర్మం ఒలిచారు. వక్షోజాలను తొలగించారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఓ హిందూ మహిళ హత్యకు గురైంది. 40 ఏళ్ల ఆ మహిళ మృతదేహం దారుణమైన స్థితిలో కనిపించింది. ఆమె తలను బాడీ నుంచి వేరు చేశారు. వక్షోజాలు తెగ్గోశారు. చర్మం కూడా ఒలిచేశారని ఇండియా టుడే కథనం పేర్కొంది.

పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా సెనేటర్ చేసిన ట్వీట్‌ను పేర్కొంటూ ఈ కథనంలో కీలక విషయాలను వివరించింది. హిందు మహిళను సింజోరో టౌన్‌లో బుధవారం హత్య చేసి ఉంటారని తెలిపింది. ఆమె తల నరికేశారని, వక్షోజాలను తొలగించారని వివరించింది. ఆమె తల, దేహం నుంచి చర్మం తొలగించారని పేర్కొంది. ఆ మహిళ విధవ. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు.

Scroll to load tweet…

క్రిష్ణ కుమారీ ట్వీట్ ప్రకారం, 40 ఏళ్ల విధవ అయిన దయా భెల్ హత్యకు గురైంది. ఆమె డెడ్ బాడీ దారుణమైన స్థితిలో కనిపించింది. ఆమె బాడీ నుంచి తలను వేరు చేసి ఉన్నది. ఆమె తల మొత్తం నుంచి చర్మాన్ని తొలగించారు. ఆ గ్రామానికి వెళ్లానని, సింజోరో, షాపురర్చాకర్‌ల నుంచి పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారని ఆమె తెలిపారు.

Also Read: పాకిస్థాన్‌లో హిందూ బాలికల కిడ్నాప్ కలకలం..ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరణ.. ఆందోళన చేపట్టిన బాధితులు

మొండెం, తల వేరుగా పడి ఆమె మృతదేహం ఓ వ్యవసాయ క్షేత్రంలో కనిపించిందని పీపీపీ నేత జియాలా అమర్ లాల్ భీల్ తెలిపారు. బాధితురాలి కుటుంబం నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. ఆమె డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారని, ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నదని పేర్కొన్నారు.