‘హిందువు’ అంటే మతపరమైన పదం కాదు.. అది భౌగోళిక పదం - కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
హిందువు అంటే మతపరమైన పదం కాదని, అది ఒక భౌగోళిక పదమని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా తనను హిందువు అని పిలవాలని కోరారని గుర్తు చేశారు.
హిందువు అనేది మతపరమైన పదం కాదని, భౌగోళిక పదమని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ గుర్తు చేసుకున్నారు. తిరువనంతపురంలోని ఓ హిందూ సమ్మేళనానికి గవర్నర్ హాజరై మాట్లాడారు. ఒక శతాబ్దం కిందట వలస పాలనలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పదవీకాలం పూర్తయినప్పుడు సర్ సయ్యద్‌ను ఆర్య సమాజ్ సభ్యులు సత్కరించారని అన్నారు. ఆ సమావేశంలో ఆయన తనను ‘హిందువు’ అని పిలవాలని కోరారని గవర్నర్ చెప్పారు.
గర్భం దాల్చేందుకు పూజలు చేస్తానని వివాహితపై సాధువు అత్యాచారం.. గుజరాత్ లో ఘటన
ఆ సమావేశంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పిన వాఖ్యలను గవర్నర్ గుర్తు చేశారు. ‘‘ఆర్య సమాజ్ సభ్యులపై నేను ఒక ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాను. మీరు నన్ను హిందువు అని ఎందుకు పిలవరు. హిందువు అనేది ఒక మతపరమైన పదంగా పరిగణించను. హిందూ అనేది ఒక భౌగోళిక పదం’’ అని అన్నారని తెలిపారు.
పెరూలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి పడిపోయిన బస్సు.. 24 మంది మృతి..
భారతదేశంలో పుట్టిన ఎవరైనా, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారం తిని జీవించే ఎవరైనా, ఇక్కడి నదుల నీరు తాగే ఎవరైనా హిందువుగా చెప్పుకునే అర్హత ఉందని గవర్నర్ అన్నారు. తనను కూడా హిందువు అని పిలవాలని కోరారు. వలసరాజ్యాల కాలంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదజాలాన్ని ఉపయోగించేవారని అన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారు పౌరుల సాధారణ హక్కులను కూడా నిర్ణయించడానికి కమ్యూనిటీలను ప్రాతిపదికగా చేసుకున్నారని చెప్పారు.
కేరళ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కేహెచ్ఎన్ఏ) అనే సంస్థ మస్కట్ హోటల్‌లో ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వి మురళీధరన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘నేను హిందువును’’ అని చెప్పుకోవడం తప్పు అని భావించేలా రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. స్వాతంత్య్రానికి ముందు కూడా సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మత సమూహాలను ముక్తకంఠంతో అంగీకరించారని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.