ఈశాన్య భారతంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విభజించు పాలించు విధానం వల్ల 70 ఏళ్లుగా ఈశాన్య ప్రాంతం భౌగోళిక,రాజకీయ అస్థిరతకు గురవుతోందని సీఎం శర్మ ఆరోపించారు.
ఈశాన్య భారతంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల ‘విభజించి పాలించు’ విధానం వల్ల 70 ఏళ్లుగా ఈశాన్య ప్రాంతంలో భౌగోళికంగా, రాజకీయంగా అస్థిరత నెలకొందని సీఎం శర్మ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఈ ప్రాంతంలో 70 ఏళ్లుగా కొనసాగిన అనేక వివాదాలను పరిష్కరించామని ముఖ్యమంత్రి శర్మ పేర్కొన్నారు. ఈశాన్య భారతంలో మోడీ సర్కార్ అనేక సమస్యలు పరిష్కారించారని అన్నారు.
ఈశాన్య భారతదేశంలో బీజేపీతోనే శాంతి పునరుద్దరణ
అస్సాంలోని బోడోలు, కర్బీ వివాదం, మిజోరంలో బ్రూస్ సమస్య లేదా త్రిపురలో ఎన్‌ఎల్‌ఎఫ్‌టి తిరుగుబాటు వంటి అనేక వివాదాలు ప్రధాని మోదీ నాయకత్వంలో శాంతించాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. కనెక్టివిటీపై నిరంతర దృష్టి కేవలం భౌతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి మాత్రమే పరిమితం కాదనీ, భావోద్వేగ సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ఈశాన్య భారతంలో 60 సార్లు, ఆయన మంత్రి మండలి 400 సార్లు పర్యటించారని తెలిపారు.
70 ఏళ్లుగా ఈశాన్య భారతదేశం భౌగోళిక , రాజకీయ అస్థిరత, అసమతుల్యతతో పోరాడిందని హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడటానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామమైన కిబితును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారని, అక్కడ 'వైబ్రంట్ విలేజ్' కార్యక్రమాన్ని ప్రారంభించారని అస్సాం సిఎం చెప్పారు. తొలిసారిగా ఓ కేంద్ర హోంమంత్రి చైనా సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్‌లో రాత్రి బస చేశారని చెప్పారు.
