అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీఎం హిమంత బిశ్వ శర్మ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారాలు రెండు రోజులు సెలవులే. వీటికి ముందే మరో రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్‌లను ఆయన ప్రకటించారు. తమ ఇంటి పెద్దలను కలుసుకుని విలువైన సమయాన్ని గడపాలని సూచించారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గువహతి: నూతన సంవత్సరం అసోం(Assam) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు సంబురాలను మోసుకు వచ్చింది. తల్లిదండ్రులను లేదా అత్తా మామలతో కలిసి గడపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు రోజుల సెలవులను స్పెషల్ కాజువల్ లీవ్(Special Leaves)గా అందించనుంది. ఈ నెల 6వ, 7వ తేదీలను స్పెషల్ క్యాజువల్ లీవ్‌లుగా ప్రకటించింది. ఈ రెండు సెలవులనూ ఈ వారం వీకెండ్‌తో కలిపి ఇస్తున్నది. 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులే. వీటికి ముందు రెండు రోజులను స్పెషల్ క్యాజువల్ లీవ్‌లుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వరుసగా నాలుగు రోజులు సెలవులు తీసుకోనున్నారు.
ఈ విషయాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ(CM Himanta Biswa sarma) స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. భారత దేశ పురాతన విలువలను పటిష్టంగా నిలబెట్టడానికి అసోం ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇంటి పెద్దలతో విలువైన సమయాన్ని గడపాలని కోరుతున్నట్టు ఓ ట్వీట్ చేశారు. ఇందుకోసం జనవరి 6వ తేదీ, 7వ తేదీలను స్పెషల్ క్యాజువల్ లీవ్‌లుగా అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. తమ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుని నవ అసోం, నవ భారత నిర్మాణానికి దోహదపడాలని సూచించారు.
Also Read: ‘క్రిస్టియన్స్ మాత్రమే వేడుకలు జరుపుకోవాలి’.. అసోంలో క్రిస్మస్ వేడుకలను అడ్డుకున్న దుండగులు
అయితే, ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్‌లను పొందాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ రెండు రోజులను తమ తల్లిదండ్రులు, లేదా అత్తా మామలతో గడపాలని, అలా వారితో సమయం గడుపుతున్నట్టు అందరు కలిసి ఒక ఫొటోనూ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే ఒక నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఈ సెలవులతో పాటు జనవరి 13వ తేదీ నుంచి మరో మూడు రోజుల పాటు బిహు హాలీడేలనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారు.
కాగా, ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్‌లపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామరూప్ రూరల్ జిల్లాలో ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు లక్ష్మీ గోస్వామి ఈ సెలవులపై సంతోషాన్ని ప్రకటించారు. తన అత్తమ్మను కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నారని, చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ట్రిప్ ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్నదని వివరించారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నానని తెలిపారు. తన ట్రిప్‌పై అత్తమ్మ తన కంటే చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. తనకు తల్లిదండ్రులు లేరని తెలిపారు. తన మామయ్య కూడా ఇటీవలే మరణించారని పేర్కొన్నారు. కాబట్టి, ఇప్పుడు ఉన్న అత్తమ్మనూ సంతోషంగా చూసుకోవడం తమ బాధ్యత అని వివరించారు.
Also Read: అస్సాం రైఫిల్స్‌పై ఉగ్రదాడి.. భారత్- మయన్మార్‌ల సరిహద్దులను మూసేస్తాం: మణిపూర్ సీఎం
అసోంలోని (Assam) కాచర్ జిల్లాలో క్రిస్మస్ వేడుకల (Christmas celebration) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకలకు కొందరు దుండగులు అంతరాయం కలిగించారు. ఈ విషయాన్ని పోలీసుల అధికారులు కూడా ధ్రువీకరించారు. హిందువులు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తూ శనివారం కొందరు వ్యక్తులు సిల్చార్‌లో (Silchar) క్రిస్మస్ కార్యక్రమానికి అంతరాయం కలిగించారని పోలీస్ సూపరింటెండెంట్ రమణ్‌దీప్ కౌర్ పీటీఐకి తెలిపారు. పట్టణంలోని బహిరంగ మైదానంలో శనివారం సాయంత్రం క్రిస్మస్ వేడుకల సందర్భంగాచోటుచేసుకుందని.. ఇందుకు పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఆమె చెప్పారు.
