అసోంలోని (Assam) కాచర్ జిల్లాలో క్రిస్మస్ వేడుకల (Christmas celebration) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకలకు కొందరు దుండగులు అంతరాయం కలిగించారు. ఈ విషయాన్ని పోలీసుల అధికారులు కూడా ధ్రువీకరించారు.


అసోంలోని (Assam) కాచర్ జిల్లాలో క్రిస్మస్ వేడుకల (Christmas celebration) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకలకు కొందరు దుండగులు అంతరాయం కలిగించారు. ఈ విషయాన్ని పోలీసుల అధికారులు కూడా ధ్రువీకరించారు. హిందువులు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తూ శనివారం కొందరు వ్యక్తులు సిల్చార్‌లో (Silchar) క్రిస్మస్ కార్యక్రమానికి అంతరాయం కలిగించారని పోలీస్ సూపరింటెండెంట్ రమణ్‌దీప్ కౌర్ పీటీఐకి తెలిపారు. పట్టణంలోని బహిరంగ మైదానంలో శనివారం సాయంత్రం క్రిస్మస్ వేడుకల సందర్భంగాచోటుచేసుకుందని.. ఇందుకు పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఆమె చెప్పారు. 

‘కొందరు అబ్బాయిలు వేదిక వద్దకు వచ్చి హిందువులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవద్దని కోరారు. క్రైస్తవులు వేడుకను జరుపుకోవడానికి వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు’ అని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందలేదని.. అయితే వేడుకలకు అంతరాయం కలిగించిన యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా రమణ్‌దీప్ కౌర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పరిశీలన జరుగుతుందని.. దీని వెనకాల ఏదైనా గ్రూప్ ప్రమేయం ఉందనే దానికి సంబంధించి ఎటువంటి ఇన్‌పుట్స్ లేవని ఆమె వెల్లడించారు.

అయితే స్థానికులు మాత్రం.. ఈ ఘటనకు పాల్పడిన యువకులు బజరంగ్ దళ్‌‌తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తున్నారు. ‘యువకులు కాషాయ కండువాలు ధరించి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ వేదిక వద్ద ఉన్న వ్యక్తులపై దాడి చేయడం ప్రారంభించారు. పట్టణంలోని నలుమూలల నుంచి ఈ వేడుకకు ప్రజలు హాజరు అయ్యారు. దీంతో అక్కడ వేదిక కిక్కిరిసిపోయింది. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది’ అని ప్రత్యక్ష సాక్ష్యులు జరిపారు. 

Also Read: క్రిస్మస్ వేడుకల్లో విషాదం.. ఆత్మహుతి దాడిలో ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

అయితే ఈ ఘటన జరిగే సమయంలో చాలా మంది సెల్పీలు, ఫొటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే అక్కడ వేడుకలను అస్వాదిస్తున్న కొందరు.. యువకులను ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి యువకులు.. హిందువులు క్రిస్మస్ రోజున వచ్చే తులసి దివాస్‌ను జరుపుకోవాలని చెప్పినట్టుగా సమాచారం.