06:19 PM (IST) Nov 12

ముగిసిన పోలింగ్, కొన్ని చోట్ల ఇంకా క్యూలోనే జనం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరడంతో వారిని ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

05:20 PM (IST) Nov 12

మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

04:05 PM (IST) Nov 12

నకిలీ లేఖతో ఓటర్లను ప్రభావితం చేస్తోంది : బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేలా బీజేపీ నకిలీ లేఖను సర్క్యూలేట్ చేస్తోందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది. బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులపై ఫిర్యాదు చేయాలని సీఈసీ రాజీవ్ కుమార్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. 

03:34 PM (IST) Nov 12

157 పోలింగ్ కేంద్రాలు మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లింగ సమానత్వం, ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గాను రాష్ట్రంలోని 157 పోలింగ్ స్టేషన్‌ల పర్యవేక్షణ బాధ్యతను మహిళా సిబ్బందికే పూర్తిగా కేటాయించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 

02:50 PM (IST) Nov 12

పరిస్ధితుల్ని చూసి ఓటేయ్యండి : ప్రియాంక

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. విచక్షణతో ఓటు వేయాలని ఆమె సూచించారు. మీ గురించి, మీ రాష్ట్ర పరిస్ధితి గురించి మీకే పూర్తిగా తెలుసునని ... పరిస్ధితులను బట్టి ఓటేయాలని కోరారు. 

02:20 PM (IST) Nov 12

1 గంట వరకు 37.19 శాతం పోలింగ్ నమోదు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచి మందకొడిగానే ఓటింగ్ జరుగుతోంది. 11 గంటల వరకు 19.98 శాతం పోలింగ్ నమోదవ్వగా... మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.19 శాతం ఓటింగ్ నమోదైంది. 

01:35 PM (IST) Nov 12

స్వరాష్ట్రంలో ఓటేసిన బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా

బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా సొంతరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు. భార్యతో కలిసి బిలాస్ పూర్ లోని విజయ్ పూర్ పోలింగ్ స్టేషన్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు నడ్డా. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని నడ్డా రాష్ట్ర ప్రజలను కోరారు.

01:08 PM (IST) Nov 12

ఆదర్శంగా నిలుస్తూ... ఓటేసేందుకు కదిలిన వందేళ్ళ వృద్దులు

హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో వృద్దులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వందేళ్ల పైబడిన వృద్దులు కూడా ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు కదలారు. ఇలా 103 ఏళ్ల వృద్దుడు సర్దార్ ప్యార్ సింగ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా వందేళ్ళు పైబడిన వృద్దులు ఓటేసారు. 

11:48 AM (IST) Nov 12

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ... మూడు గంటల్లో 17.98 శాతం పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ లో మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ సమయం గడుస్తున్నకొద్దీ ఊపందుకుంటోంది. మొదటి గంటలొ కేవలం 4శాతం మాత్రమే నమోదయిన పోలింగ్ మూడుగంటల్లో అంటే 8 నుండి 11 గంటల వరకు 17.98 శాతానికి చేరుకుంది.

11:15 AM (IST) Nov 12

ఓటేసిన మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలో భాగంగా ఇవాళ జరుగుతన్న పోలింగ్ లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ పాల్గొన్నారు. షిమ్లా పోలింగ్ స్టేషన్ లో ఆయన ఓటుహక్కును వినియెగించుకున్నారు.


10:22 AM (IST) Nov 12

ఓటేసిన హిమాచల్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్, ఆయన తనయుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి హమిపూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

09:59 AM (IST) Nov 12

హిమాచల్ ఎన్నికలు... మొదటిగంటలో కేవలం 4శాతం పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలో అంటూ 8 నుండి 9 గంటల వరకు కేవలం 4శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 


09:23 AM (IST) Nov 12

ఓటేసిన హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి బిజెపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఇక షిమ్లా అర్భన్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సంజయ్ సూద్ కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

09:07 AM (IST) Nov 12

సిమ్లాలోని పోలింగ్ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ సమయం గడుస్తున్నకొద్దీ పుంజుకుంటోంది. రాజధాని సిమ్లాలోని పోలింగ్ కేంద్రంవద్ద ఓటర్లు బారులుతీరారు. 

08:32 AM (IST) Nov 12

దేవున్ని పూజించి ఓటేసేందుకు బయలుదేరిన హిమాచల్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. అంతకంటే ముందు ఆయన దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసారు. 

08:07 AM (IST) Nov 12

హిమాచల్ ప్రదేశ్ లో పోలింగ్ షురూ...

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. 

07:54 AM (IST) Nov 12

పోలింగ్ కొద్దిక్షణాల ముందు... హిమాచల్ ఓటర్లకు ప్రధాని పిలుపు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొద్దిక్షణాల ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక పిలుపునిచ్చారు. ఇవాళ దేవభూమి హిమాచల్ లో పోలింగ్ జరగనుందని... ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని సరికొత్త రికార్డ్ సృష్టించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకోనున్న యువతీ యువకులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…


07:13 AM (IST) Nov 12

సెరాజ్ నుండి సీఎం జయరాం ఠాకూర్ పోటీ

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ సెరాజ్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. ఇక కసుప్తి నుండి సురేష్ భరద్వాజ్, హరోలీ నుండి కాంగ్రెస్ సిఎల్పి లీడర్ ముఖేష్ అగ్నిహోత్రి, షిమ్లా రూరల్ నుండి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. 

07:02 AM (IST) Nov 12

మంచుతో నిండిన ప్రాంతాల్లోనూ పోలింగ్...

హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 7,884 పోలింగ్ కేంద్రాల్లో 400 ప్రాంతాలు పూర్తిగా మంచుతో నిండివున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఎన్నికల సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. సముద్రమట్టానికి 15వేల అడుగులో వున్న తషిగాంగ్ పోలింగ్ కేంద్రంలోనూ ఇవాళ పోలింగ్ జరగుతోంది.