Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుకు కరోనా పాజిటివ్.. ప్రధానితో భేటీ వాయిదా

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుఖ్‌విందర్ సింగ్ సుఖుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో ప్రధానితో ఆయన సమావేశం వాయిదా పడింది. 

Himachal Pradesh CM Sukhwinder Singh Sukhku tested positive for Corona.. Meeting with Prime Minister postponed
Author
First Published Dec 19, 2022, 3:50 PM IST

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖుకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటించారు. వాస్తవానికి సుఖు సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలవాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా నిర్ధారణ కావడం వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. 

రూ. 10 వేలు ఇవ్వండి.. లైంగిక వేధింపుల కేసు సెటిల్ చేస్తాం.. అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసులపై వేటు

ప్రధానమంత్రిని కలవడానికి ముందు సాధారణంగా కరోనా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. అందుకే పరీక్ష నిర్వహించామని, దీంతో పాజిటివ్ గా తేలిందని చెప్పారు. సీఎంకు కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పారు. కానీ ముందుజాగ్రత్త చర్యగా ఆయన సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు. కరోనా వల్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు షెడ్యూల్ మొత్తం వాయిదా వేసుకున్నారని ఆ అధికారి చెప్పారు.

డిసెంబరు 16న రాజస్థాన్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, కొత్తగా ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలతో కలిసి సుఖూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. సుఖు ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాతో పాలు పలువురు కాంగ్రెస్ నాయకులను ఆయన కలిశారు. 

బెంగాల్‌లో వామపక్షానికి పెరిగిన ఓటు షేర్.. కారణమేంటని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించిన అమిత్ షా.. జవాబిదే!

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 68 సీట్లలో 40 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు. సుఖు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

హిమాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా సుఖ్విందర్ సింగ్ సుఖు సుమారు దశాబ్దకాలం బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆయన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా రికార్డుస్థాయిలో ఆరు సంవత్సరాలు కొనసాగారు. 2013 నుంచి 2019 వరకు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తొలిసారి 2003లో నదౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లోనూ మళ్లీ గెలిచి తన సీటును కాపాడుకున్నారు. కానీ, 2012లో పరాజయం పాలయ్యారు. కానీ, మళ్లీ 2017లో నెగ్గారు. ఈ సారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

బెంగాల్‌లో వామపక్షానికి పెరిగిన ఓటు షేర్.. కారణమేంటని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించిన అమిత్ షా.. జవాబిదే!

షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు చీఫ్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ సింగ్ సుఖు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరుచూ ఆరు సార్లు సీఎంగా చేసిన దివంగత నేత వీరభద్ర సింగ్‌తో విబేధించేవారు. సుఖ్విందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ దిగువ భాగం నుంచి సీఎంగా ఎన్నికైన తొలి నేత సుఖ్విందర్ సింగ్ సుఖు రికార్డు నెలకొల్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios