తమిళనాడులో ఓ హిజ్రా బలవన్మరణానికి పాల్పడింది. ఓ యువకుడు తన ప్రేమను నిరాకరించాడని మనస్థాపం చెంది ఆత్మహత్య చెసుకుంది.

తమిళనాడులోని అన్నానగర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమలో విఫలమవడం వల్ల ఓ హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మూలప్పాలైయమ్‌ వినాయకుడి ఆలయ వీధిలో ఉండే సుస్మితా అనే హిజ్రా తల్లితో కలిసి ఆ కాలనీలో నివసిస్తోంది. ఆమెకు ఇటీవల వీరప్పన్‌ చత్రమ్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.

వారిద్దరూ తరుచూ కలుస్తూ ఉండే వారు. ఈ క్రమంలో ఆ యువకుడిపై సుస్మితా ప్రేమ పెంచుకుంది. కొద్ది రోజుల తర్వాత తనని పెళ్ళి చేసుకోవలంటూ ఆ యువకునిపై ఓత్తిడి చెసింది సుస్మితా .

దీనికి అతను నిరాకరించడంతో సుస్మితా మనస్తాపం చెందింది. చాలా రోజులు డిప్రేషన్‌లోకి వెళ్ళిపోయింది. మంగళవారం ఉదయం ఎవరు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ విషయాన్ని గమనించిన తల్లి స్ధానికుల సయహంతో సుస్మితా ను కిందకు దించి ఆస్పత్రికి తరలించింది. అనంతరం పరీక్షించిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.