Asianet News TeluguAsianet News Telugu

మీకు 80,000 మంది పోలీసులు ఉన్నారు.. అమృతపాల్ సింగ్ ఎలా పారిపోయాడు?.. పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న..

ఖలిస్తాన్ నాయకుడు అమృతపాల్ సింగ్, అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే' సభ్యులపై పంజాబ్ పోలీసులు చర్య తీసుకున్న నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

High Court question to Punjab Govt about Amritpal Singh Flee - bsb
Author
First Published Mar 21, 2023, 2:21 PM IST

చండీగఢ్ : పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ రోజు పంజాబ్ పోలీసులపై మండిపడింది. ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్‌పై పోలీసుల ఆపరేషన్‌లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని వారిని కోరింది. "మీకు 80,000 మంది పోలీసులు ఉన్నారు, అమృతపాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?" అని హైకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఖలిస్తాన్ నాయకుడు, అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే' సభ్యులపై పంజాబ్ పోలీసులు చర్య తీసుకున్న నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు వచ్చాయి. అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ ప్రభుత్వం శనివారం భారీ అణిచివేతను ప్రారంభించింది, అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, జలంధర్ జిల్లాలో పోలీసులు అశ్వదళాన్ని అడ్డగించినప్పుడు పోలీసులకు టోకరా ఇచ్చి వారి నుండి తప్పించుకున్నాడు. ఖలిస్తానీ-పాకిస్థాన్ ఏజెంట్‌గా ప్రభుత్వం అభివర్ణించే అమృతపాల్ సింగ్ చివరిసారిగా జలంధర్‌లో శనివారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై వేగంగా వెడుతూ చివరిసారిగా కనిపించాడు. 

అమృత్ పాల్ సింగ్ వెనుక ఐఎస్ఐ, విదేశీ నిధులు, మాదకద్రవ్యాల ముఠాల సహకారం..!!

సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్‌లో చురుకుగా పనిచేస్తున్నాడు. తరచూ సాయుధ మద్దతుదారులతో ఉన్న ఆయన వార్తల్లో నిలిచాడ. ఖలిస్తానీ వేర్పాటువాది, టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడిగా పేర్కొన్నాడు. అతడిని మద్దతుదారులు "భింద్రన్‌వాలే 2.0" అని పిలుస్తారు.అమృతపాల్ సింగ్, అతని మద్దతుదారులు అతని సహాయకులలో ఒకరిని విడుదల చేయడం కోసం కత్తులు, తుపాకులతో పోలీసు స్టేషన్‌లోకి చొరబడిన ఒక నెల తర్వాత వారిమీద అణిచివేత జరిగింది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు.

ఇదిలా ఉండగా, అమృత్ పాల్ సింగ్ వెనక పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ నిధుల ప్రమేయం కూడా ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. వీటితోపాటు అమృత్ పాల్ సింగ్ కు మాదకద్రవ్యాల ముఠాలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అధికారుల ప్రకారం అమృత్ పాల్ సింగ్ కు మెర్సిడెజ్ కారును ఈ ముఠాలే బహుమతిగా ఇచ్చాయని…ఆయుధాలకు సంబంధించిన సహకారాన్ని ఐఎస్ఐ అందిస్తోందని  భావిస్తున్నారు.

అమృత్ పాల్ సింగ్ తమ కళ్లు గప్పి  తప్పించుకున్న సమయంలో ఆ కారులోనే ఉన్నట్లుగా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అంతేకాదు నిందితుడైన అమృత్ పాల్ సింగ్ కు  ఓ ప్రైవేటు సైన్యమే ఉందన్నారు. పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సుఖ్ ఛైన్ సింగ్ గిల్ సోమవారం జాతీయ భద్రతా చట్టం కింద వీరిలోని ఐదుగురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసినట్లుగా  విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకు వీరి మీద ఆరు కేసులు నమోదు చేశామన్నారు. 114 మందిని అరెస్టు చేసినట్లు సుఖ్ ఛైన్ సింగ్ గిల్ తెలిపారు. అమృత్  పాల్  సింగ్ చాలాకాలం దుబాయ్ లో ఉన్నాడని అక్కడ ఉన్న సమయంలోనే ఉగ్ర మూఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో వెలుగు చూసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios