తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో దేశవిదేశాల్లోని తమిళులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో దేశవిదేశాల్లోని తమిళులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కర్ణాటక నుంచి తమిళనాడు వైపు.. తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి.. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. బెంగళూరులో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.