న్యూఢిల్లీ: రెండోసారి ప్రధానమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ దఫా కొందరికి మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను  ఈ దఫా కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం ఉంది.

బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు కూడ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో కీలకంగా వ్యవహరించిన రామ్ మాధవ్‌కు కూడ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు అమిత్ షా మోడీ కేబినెట్‌లో చేరే అవకాశం ఉన్నందున బీజేపీ జాతీయ  అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్‌ను నియమించే అవకాశం లేకపోలేదు.

మోడీ కేబినెట్‌లో చోటు దక్కుతోందని ప్రచారం సాగుతున్న వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

స్పోర్ట్స్ శాఖ మంత్రి: గౌతం గంభీర్
విదేశీ వ్యవహరాలు: స్మృతి ఇరానీ
ఆర్థిక శాఖ: జయంత్ సిన్హా
రక్షణ శాఖ: రాజీవ్ ప్రతాప్ రూఢీ
హోం మంత్రి: అమిత్ షా
వాణిజ్య పన్నులు: వరుణ్ గాంధీ
రైల్వేశాఖ: పీయూష్ గోయల్
వ్యవసాయ: రాజ్‌నాథ్ సింగ్
మానవ వనరుల శాఖ: నిర్మలా సీతారామన్
రవాణా శాఖ: నితిన్ గడ్కరీ
పరిశ్రమల శాఖ: అరవింద్ సావంత్ (శివసేన)
పార్లమెంటరీ వ్యవహరాల శాఖ:  షానవాజ్ హుస్సేన్
మైనార్టీ వ్యవహరాల శాఖ: ముక్తార్ అబ్బాస్ నక్వీ
సివిల్ ఏవియేషన్: పవన్ వర్మ (జేడీయూ)
ప్రసారశాఖ మంత్రి: బాబుల్ సుప్రియో
పెట్రోలియం:  కిరన్ రిజుజు
ఎనర్జీ శాఖ:  డాక్టర్ అరవింద్
ఫ్లామిలీ ప్లానింగ్: అనంత్ కుమార్ హేగ్డే
గ్రామీణాభివృద్ధి: శివరాజ్ సింగ్ చౌహాన్
మహిళాసాధికారిత శాఖ: మినాక్షీ లేఖి
అర్బన్ డెవలప్‌మెంట్: గోపాల్ శెట్టి
న్యాయశాఖ:  రవిశంకర్ ప్రసాద్
పుడ్ ప్రాసెసింగ్: చిరాగ్ పాశ్వాన్ (ఎల్పీ)
టూరిజం: అనురాగ్ ఠాకూర్
మేకిన్ ఇన్ ఇండియా: ధర్మేంధ్ర ప్రధాన్
ఆరోగ్యశాఖ: జేపీ నడ్డా
బొగ్గు, మినరల్ శాఖ: గిరిరాజ్ సింగ్
స్కిల్ ఇండియా: జయవర్ధన్ రాథోడ్
పర్యావరణశాఖ: సదానంద గౌడ
సైన్స్ అండ్ టెక్నాలజీ: హరిప్రియా సురేష్
కార్మిక: అనుప్రియా పటేల్
పంచాయితీ రాజ్ దుష్యంత్ సింగ్
టెక్స్ టైల్స్: సరోజ్ పాండే
వినియోగదారుల వ్యవహరాలు: హర్ సిమ్రత్ కౌర్
కెమికల్ శాఖ: డాక్టర్ హర్షవర్ధన్
ఎంప్లాయిమెంట్ జనరేషన్: రామ్ మాధవ్