Asianet News TeluguAsianet News Telugu

Rains: ఈ నెల12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.. : ఐఎండీ

Heavy rains: సెప్టెంబరు 12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన‌ తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో వర్షపాతం పెరుగుతుందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దక్షిణ భారతదేశంలో తేలికపాటి నుండి మోస్తరు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని అంచనా వేస్తుంది. ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు సైతం కురిసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.
 

Heavy rains in Telangana, Andhra Pradesh from Sep 12, IMD warnings RMA
Author
First Published Sep 10, 2023, 10:20 AM IST

Telangana rains: సెప్టెంబరు 12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన‌ తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో వర్షపాతం పెరుగుతుందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దక్షిణ భారతదేశంలో తేలికపాటి నుండి మోస్తరు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని అంచనా వేస్తుంది. ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు సైతం కురిసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సెప్టెంబర్ 12 నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంత‌కుముందు, శని, ఆదివారాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయనీ, వచ్చే మూడు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ,  ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈస్ట్ ఇండియాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం పశ్చిమబెంగాల్, బిహార్ లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. అండమాన్ నికోబార్ దీవుల్లో సెప్టెంబర్ 12 వరకు, ఒడిశాలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది. శని, ఆదివారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం శ‌నివారం ఐఎండీ త‌న రిపోర్టులో పేర్కొంది. సెప్టెంబర్ 11 వరకు కేరళ, మాహేలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంద‌నీ, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో ఈ  త‌ర‌హా వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

మధ్య భారతదేశంలో, తేలికపాటి నుండి ఒక మోస్తరు నుండి విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా మధ్యప్రదేశ్ లో సెప్టెంబర్ 11 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్యప్రదేశ్ లోని ప‌లు ప్రాంతాల్లో కూడా శనివారం భారీ వర్షాలు కురిశాయి. మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు నుంచి విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో శని, ఆదివారాల్లో ఈ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంత‌కుముందు ఐఎండీ త‌న బులిటెన్ లో పేర్కొంది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఆదివారం నుంచి ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 12న అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య భారతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, తూర్పు రాజస్థాన్ లో శనివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. యూపీలో, ఉత్త‌రాఖండ్ లో ఆదివారం నుంచి వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios