Asianet News TeluguAsianet News Telugu

చెన్నైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు...ఆరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు

చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియాలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 8 వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు.
 
heavy rains in tamilnadu
Author
Tamil Nadu, First Published Oct 6, 2018, 5:35 PM IST

చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియాలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 8 వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు.

నిన్నటి నుండి తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు పలు జిల్లాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంబంవించే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రమాదం పొంచివున్న తిరువళ్లూర్‌, కాంచీపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కారైక్కల్‌, చెన్నై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు.
 
ఈ వర్షాలపై సీఎం పళనిస్వామి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెన్నైలో మొత్తం 205 వరద ముంపు ప్రాంతాలున్నాయని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సహయం కోసం ప్రజలు ‘1077’ అనే నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని పళని స్వామి ప్రకటించారు.  పోలీసు, అగ్నిమాపక శాఖలతో పాటు సంబంధిత అధికారులు సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని సీఎం సీఎం ఆదేశించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios