కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఇలాంటి పరిస్థితేే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల ప్రభావంతో కొచ్చి సిటీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

కేర‌ళ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప‌లు నగ‌రాలు నీట మునిగాయి. ముఖ్యంగా ప్ర‌ధాన న‌గ‌ర‌మైన కొచ్చిలో ఈ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. నేటి ఉద‌యం నుంచి కూడా భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో ఎంజీ రోడ్డు, మేనక, కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లోని పలు దుకాణాలు నీటమునిగాయి. దీంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం.. అన్ని విచారణలను రద్దు చేస్తూ...

ఎంజీ రోడ్డులో ఏర్ప‌డ్డ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఉదయం ఆఫీసుల‌కు వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. మరో వైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కాసర్‌గోడ్ మినహా అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే వచ్చే ఐదు రోజుల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. 

Scroll to load tweet…

ఈ వ‌ర‌ద‌ల విష‌యంలో కొచ్చి మేయర్ ఎం అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. సముద్రంలోకి నీరు వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల వ‌ర‌ద ప‌రిస్థితి ఎదురైంద‌ని చెప్పారు. కొన్ని నెలల క్రితమే కార్పొరేషన్‌లో డ్రైనేజీ క్లీనింగ్‌ పూర్తి చేసిన ప్రాంతాల్లో కూడా ముంపు ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని, నీళ్లు వెళ్లేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

కొచ్చిలోని పలు నివాస ప్రాంతాలు కూడా వరదలకు గురయ్యాయి. ‘‘ రెండు నెలల క్రితం స్థానిక సంస్థ కాలువలను శుభ్రం చేసినప్పటికీ తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం వల్ల మా ప్రాంతం మొత్తం వరదకు గురైంది’’ అని ఎలంకులం సమీపంలోని నివాసి కెజె మాథ్యూ చెప్పారని ‘‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ’’ నివేదించింది.

ఆజాద్‌కు మద్ధతుగా కాశ్మీర్ కాంగ్రెస్ శ్రేణులు : నేతలు, కార్యకర్తలు ఆయన వెంటే... హస్తం ఇక ఖాళీయేనా..?

కాగా డ్రైనేజీలను శాస్త్రీయంగా నిర్మించకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. నీరు బయటకు వెళ్లేందుకు చాలా ఇరుకైన స్థలం ఉండటంతో కొచ్చి కార్పొరేషన్ కార్మికులు కూడా ఏం చేయ‌లేక‌పోతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వీధులన్నీ జలమయమై విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎంజీ రోడ్డు, బ్రాడ్‌వే, పనంపిల్లి నగర్‌, కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లోని దుకాణాలు జలమయమయ్యాయి.