ఉత్తరాఖండ్ లో పలు జిల్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం బద్రీనాథ్ జాతీయ రహదారిపై పిపల్కోటి సమీపంలో కూలి పడగా.. గురువారం ఉదయం కూడా అదే రహదారిపై కొండచరియలు పడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై నందప్రయాగ్, చింకా సమీపంలోని రహదారి గురువారం ఉదయం భారీగా కొండచరియలు కుప్పకూలాయి. ఈ కొండ చరియాల శిథిలాలు రోడ్డుపై పేరుకుపోయాయి. దీంతో ఈ రహదారిని అధికారులు మూసివేశారు. రోడ్డుపై భారీగా పేరుకుపోయిన శిథిలాల కుప్ప ఫొటోలను చమోలి పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా.. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పిపల్కోటి సమీపంలో కూడా మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ దారిని కూడా అధికారులు మూసివేశారు.
కోర్టు కేసు సెటిల్ మెంట్ కు అంగీకరించలేదలని మహిళపై దాడి.. బట్టలు చింపేసి మరీ దారుణం.. వీడియో వైరల్
కాగా.. ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న చుంగి బడేతి సొరంగం చుట్టూ కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో సొరంగం భద్రతపై సంబంధిత కార్యనిర్వాహక సంస్థ అధికారులకు సమాచారం అందించామని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ ‘ఇండియా టీవీ’తో తెలిపారు.
