Asianet News TeluguAsianet News Telugu

Chennai Rains: చెన్నైని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. రోడ్లన్నీ జలమయం

Chennai Rains: త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైని ఆక‌స్మిక భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ఉరుములు మెరుపుల‌తో భారీ వ‌ర్షం ప‌డ‌టంతో న‌గ‌ర‌మంతా జ‌ల‌య‌మం అయింది.  వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.  
 

Heavy and continuous rains lash Chennai, IMD issues warning
Author
Hyderabad, First Published Dec 31, 2021, 1:29 AM IST

Chennai Rains: త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైని ఆక‌స్మిక భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ఉరుములు మెరుపుల‌తో భారీ వ‌ర్షం ప‌డ‌టంతో  న‌గ‌ర‌మంతా జ‌ల‌య‌మం అయింది. చెన్నైతో పాటు న‌గ‌ర శివారు ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల‌తో బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తూ.. వ‌ర్షం ప‌డింది. దీంతో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది.  ముఖ్యంగా మౌంట్ రోడ్, పూనమల్లి రోడ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కీలోమీట‌ర్ల పొడ‌వునా వాహ‌నాలు నిలిచిపోయాయి. ఆక‌స్మ‌త్తుగా ప‌డిన వ‌ర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన వ‌ర్షాలు.. రాత్రి 9 గంట‌ల త‌ర్వ‌త కూడా ప‌లుచోట్ల వ‌ర్షం ప‌డుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే భారీ వర్షాల కారణంగా మూడు సబ్‌వేలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కేకే నగర్, మైలాపూర్, సెంబియం, నుంగంబాక్కం, అశోక్ నగర్ తదితర ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. 14 రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు.

Also Read: De Kock: టెస్ట్ క్రికెట్ కు క్వింట‌న్ డికాక్ గుడ్‌బై.. జీవితంలో టైంను కొన‌లేమంటూ..

గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు, గంగురెడ్డి సబ్‌వే, దురైస్వామి సబ్‌వే, ఆర్‌బీఐ సబ్‌వేలు వ‌ర్ష‌పు నీరు కార‌ణంగా మూసివేశారు.  అలాగే,  కులత్తూరు వినాయగపురం – రెడ్‌హిల్స్ రోడ్, పెరియార్ సలై – 100 అడుగుల రోడ్డు, నుంగంబాక్కం లేక్‌వ్యూ సలై, శాంతోమ్ కచేరీ రోడ్, రాజరతీనం స్టేడియం ప్రాంతాల్లో వాహ‌నాల‌ను దారి మ‌ళ్లీంచారు. పెరియమెట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జోన్స్ రోడ్‌లలో వాహనాలను దారి మళ్లించారు. రహదారుల్లో అడగులోతున వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. భారీగా వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు. జ‌ల‌మ‌య‌మైన రోడ్ల నుంచి నీటిని తొల‌గించ‌డానికి అధికారులు మోటారు పంపుల‌ను ఉప‌యోగిస్తున్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలనీ, వాహ‌న‌దారులు సుర‌క్షిత మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు పేర్కొంటున్నారు. 

Also Read: Apple: టెక్ దిగ్గ‌జం ఆపిల్ త‌మిళ‌నాడు ప్లాంట్.. షాకింగ్ విష‌యాలు వెలుగులోకి..

ఇదిలావుండ‌గా, ఆకస్మికంగా ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం ప‌డ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైతో పాటు దాని ప‌రిస‌ర ప్రాంతాలో ఇప్ప‌టికీ వ‌ర్షం ప‌డుతున్నది. రానున్న రెండు రోజుల్లోనూ భారీ వ‌ర్షాలు కురిసే అవకాశముంద‌ని వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్ల‌డించారు. ఐఎండీ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 21. జ‌న‌వ‌రి 1న భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. చెన్నై న‌గ‌రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో అతిభారీ వర్షం కురుస్తుందని, రాబోయే ఆరు గంటల పాటు ఈ ప్రాంతంలో వర్షం కొనసాగుతుందని అంచనా వేసింది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ఎంఆర్‌సీ నగర్‌లో 198 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7:45 గంటల వరకు నుంగంబాక్కంలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని IMD తెలిపింది. రాబోయే 48 గంటలపాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని  చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. న‌గ‌ర స‌రిహ‌ద్దు జిల్లాల‌కు హెచ్చిరిక‌లు జారీ చేసింది. 

Also Read: journalists: 2021లో 45 మంది జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌.. ప్ర‌మాదంలో పత్రికా స్వేచ్ఛ‌..


 

Follow Us:
Download App:
  • android
  • ios