దారుణం:క్వారంటైన్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌పై రాళ్ల దాడి, గాయాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానితుడిని క్వారంటైన్ కు తీసుకెళ్తున్న అంబులెన్స్ పై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.దీంతో వైద్య సిబ్బంది గాయపడ్డారు.ఈ దాడిలో పోలీసులకు కూడ గాయాలయ్యాయి.
యూపీలోని మోరాదాబాద్ లోని హాజీ నెబ్ మజీద్ ప్రాంతంలో బుధవారం నాడు చోటు చేసుకొంది. అల్లరిమూకల దాడిలో రెండు అంబులెన్స్ లు, రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.
కరోనా తో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రయత్నించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని అంబులెన్స్ డ్రైవర్ ప్రకటించారు.మృతుడి కుటుంబసభ్యులను అంబులెన్స్ లో ఎక్కించగానే అల్లరి మూకలు రాళ్లతో దాడికి దిగారు.
ఈ దాడికి పాల్పడిన అల్లరి మూకలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో నిత్యావసర సరుకులు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగానే దాడికి దిగినట్టుగా చెప్పారు. మరో వైపు క్వారంటైన్ సెంటర్ లో కూడ సరైన భోజన వసతులు కూడ కల్పించడం లేదనేది స్థానికుల ఆరోపణ.
also read:కరోనాతో ప్రతి ఒక్కరికీ రూ. 15 వేలు: అసలు వాస్తవం ఇదీ...
అయితే హెల్త్ వర్కర్స్ పై దాడికి పాల్పడడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.