ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతూ.. యుద్ధ నేపథ్యంలో ఇండియాకు తిరిగివచ్చిన విద్యార్థులుకు భారత ప్రభుత్వం ఊరట కలిగించనుంది. వారి విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేసే ప్రత్యామ్నా అవకాశాల దిశగా కృషి చేస్తోంది.
ఢిల్లీ : Ukraineలో కొనసాగుతోన్న భీకరపోరు indiansను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వేలమంది medicine చదువుతున్న విద్యార్థులు భారత్లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, ప్రాణాలతో బయటపడి వచ్చినప్పటికీ... అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోయిందనే ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులల్లో వ్యక్తమవుతుంది.
ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా NMC నిబంధనలు సడలించడం లేదా భారత్, ఇతర దేశాల్లో Medical education ను పూర్తిచేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జాతీయ మెడికల్ కమిషన్ (Foreign Medical Graduate License) -2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్షిప్ కూడా అక్కడే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగతావీ కూడా అక్కడే పూర్తి చేయాలి. మెడిసిన్ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు.
అయితే, ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా నిబంధనలు సడలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. లేదా భారత్ లోని ప్రైవేట్ కాలేజీలో కోర్సు పూర్తి చేయడం/విదేశాల్లోని కాలేజీలకు బదిలీ చేసుకునే వీలు కల్పించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ మెడికల్ కమిషన్, ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖతో పాటు నీతి ఆయోగ్ త్వరలోనే అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కలిగించే అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. మరో రెండేళ్లు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. భారత్ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువే. అందుకే ప్రతి ఏటా వేలమంది మెడిసిన్ ఔత్సాహికులు భారత్ నుంచి ఉక్రెయిన్ కు తరలివెల్తుంటారు.
ఇదిలా ఉండగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటికే ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఉక్రెయిన్ రాజధానిలో మరో భారతీయ విద్యార్థి బుల్లెట్ కాల్పుల్లో గాయపడి.. ఆసుపత్రి పాలయ్యాడు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) రాష్ట్ర మంత్రి (MoS) జనరల్ VK సింగ్ గురువారం పోలాండ్ Rzeszow విమానాశ్రయంలో ఈ మేరకు సమాచారాన్ని వెల్లడించారు. "కైవ్‌కు చెందిన ఒక విద్యార్థిపై కాల్పులు జరిపినట్లు నివేదికలు అందాయి. అతన్ని వెంటనే కైవ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు" అని జనరల్ (రిటైర్డ్) సింగ్ చెప్పారు.
కైవ్‌లో ఉన్న భారతీయవిద్యార్థులందర్నీ వెంటనే ఖాళీ చేయాలన్న లక్ష్యంతో భారత రాయబార కార్యాలయం చాలామేరకు తరలించింది. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు.. తుపాకీ బుల్లెట్ కు మతం, జాతీయత అనేది కనిపించదు”అన్నారాయన.
అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ నుండి పారిపోయి, సురక్షితంగా భారతదేశానికి చేరుకోవడానికి పోలాండ్ సరిహద్దుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
నలుగురు కేంద్ర మంత్రులు, హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరెన్ రిజిజు మరియు జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.
