Asianet News TeluguAsianet News Telugu

10 కోట్ల విరాళం, గ్రామాల దత్తత.. కేరళపై హెడ్‌ఎఫ్ఎసీ బ్యాంక్ వరాల జల్లు

భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళకు దాతలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కేరళపై వరాల జల్లు కురిపించింది

hdfc bank donates Rs.10 crores to kerala
Author
Kerala, First Published Aug 29, 2018, 5:49 PM IST

భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళకు దాతలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కేరళపై వరాల జల్లు కురిపించింది. పదికోట్ల రూపాయల విరాళంతో పాటు.. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన 30 గ్రామాలను దత్తత తీసుకుంది.

దీనితో పాటు ఆగస్టు నెలకి సంబంధించిన లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. ఆపద సమయంలో కేరళను ఆదుకునేందుకు ఉద్యోగులు ముందుకు వచ్చారని.. వారి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పూరి చెప్పారు. గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios