లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నట్టు తెలుస్తున్నది. ఆయన ఆరోగ్యం మెల్లగా మెరుగవుతున్నదని కుమార్తె మీసా భారతి ట్వీట్ చేశారు. ఈ రోజు ఉదయం తీసిన ఆయన ఫొటోలను షేర్ చేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ సుప్రీమ్ లీడర్ లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మెరుగవుతున్నది. బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన చేరిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఎయిమ్స్ నుంచే లాలు ప్రసాద్ యాదవ్ చిత్రాన్ని ఆయన కుమార్తె, రాజ్యసభ ఎంపీ మీసా భారతి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
లాలు ప్రసాద్ ఇటీవలి కాలంలో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా, ఆయన అనారోగ్యం బారిన పడటంతో పాట్నాలోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ కనిపించలేదు. ఆరోగ్య పరిస్థితి అలాగే ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
ప్రజల ప్రార్థనలు, ఢిల్లీ ఎయిమ్స్‌లో మంచి మెడికల్ కేర్‌తో తన తండ్రి లాలు ప్రసాద్ ఆరోగ్యం మెల్లగా మెరుగవుతున్నదని కుమార్తె మీసా భారతి ట్వీట్ చేశారు. ఇప్పుడు లాలు ప్రసాద్ స్వయంగా కూర్చోగలుగుతున్నాడని తెలిపారు. ఒకరి సహకారంతో నిలబడుతున్నాడని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలైనా వాటిని జయించి విజయంతో తిరిగి రావడం లాలు ప్రసాద్‌కు బాగా తెలుసు అని వివరించారు. అనవసమరైన వదంతులను పట్టించుకోవద్దని తెలిపారు. ఈ ట్వీట్‌తోపాటు లాలు ప్రసాద్ ఈ రోజు ఉదయం ఫొటోలను ఆమె షేర్ చేశారు.
