Haryana: ఓ కిలేడీ తన అందంతో డబ్బున్న వ్యక్తులకు గాలం వేసి పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్ నైట్ రోజున వరుడికి మత్తుమందు ఇచ్చి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఏకంగా.. మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకుంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
Haryana: సమాజంలో ఎవ్వరిని నమ్మాలో.. ఎవ్వరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి... కళ్లు మూసి తెరిచే లోపు.. ఉన్నచోటనే నిలువు దోపిడి చేసే.. మోసగాళ్లున్నారు. డబ్బు కోసం ఎంతటీ నీచానికైనా పాల్పడుతున్నారు. తాజాగా.. చంఢీగర్ కు చెందిన ఓ యువతి తన అంద చందాలతో యువకులకు గాలం వేసి.. అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకుంటుంది. ఇక, ఫస్ట్ నైట్ రోజు కిలాడీ తన విశ్వరూపం చూపిస్తుంది. పెళ్లి కొడుకు పాల గ్లాసులో మత్తుమందు వేసి.. డబ్బులు, నగలతో మాయమవుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. మూడు నెలల్లో ఏడుగురి పెళ్ళి చేసుకుని.. వారి ఇళ్లను గుళ్ల చేసేది. ఇలా సినీ ఫక్కీ తరహాలో చేశారు. చివరికి ఈ కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ యువతి.. తన అందచందాలతో విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకులకు గాలం చేస్తుంది. తన ప్రణాళిక ప్రకారం.. ముందుగా ఆస్తిపాస్తులున్న యువకుడి టార్గెట్ చేస్తుంది. నెమ్మదిగా పరిచయం చేసుకొని.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని, తన పెళ్లి ఓ మధ్యవర్తితో జరిగిందని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. దీంతో వారి మధ్య ఉన్న సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చేది. పెండ్లి అయినా.. తరువాత.. ఫస్ట్ నైట్ రోజున తన విశ్వరూపం చూపించేది. సదరు వరుడికి మత్తుమందు మాత్రలు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలను దొచుకోని అక్కడి నుంచి జంప్ అయ్యేంది.
ఇలా దారుణాలకు పాల్పడుతున్న క్రమంలో ఆమె వివాహం చేసుకున్న నాలుగో భర్త రాజేందర్ .. తాను మోస పోయాయని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులకు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేసి.. సదరు దొంగ ముఠాను పట్టుకుని ఆరా తీస్తే.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ మూడు నెలల్లో ఏడో పెళ్లి చేసుకుందనీ వారి విచారణలో తెలింది. ఆమెను సహకరించిన ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకున్నారు.
విచారణలో భాగంగా.. ఆమె మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్‌ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్‌లో చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైనా మొదటి రోజే.. డబ్బు, నగలు తో అక్కడి నుంచి పరార్ అయ్యింది. తరువాత.. ఫిబ్రవరి 15న మూడో వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 21న నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రాజేందర్ అనే వ్యక్తితో ఐదో పెళ్లి, కుటానాకు చెందిన గౌరవ్తో ఆరో పెళ్లి, కర్నాల్కు చెందిన సందీప్ ఆరోసారి పెళ్లి చేసుకుంది. చివరగా మార్చి 26న బుద్వాకు చెందిన సుమిత్తో పెళ్లి జరిగింది. అంటే మూడు నెలల్లో ఏడు పెళ్లిళ్లు చేసుకుంది.
అయితే రంగంలోకి దిగిన పోలీసులు వీరి మోసాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఓ మ్యారేజ్ ఏజెంట్ భిజేంద్ర సింగ్ సహా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వాందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి బ్లఫ్ మాస్టర్ సినిమా స్టైల్లో మోసం చేశారు. చివరికి జైలే గతి అయింది. దీంతో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
