కరోనా ఎఫెక్ట్: జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించిన హర్యానా సర్కార్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులకు అండగా నిలిచింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వార్తల సేకరణలో నిర్విరామంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల భీమా సదుపాయం కల్పించనున్నట్టుగా ప్రకటించింది.

Haryana govt announces RS.10 lakh insurance for journalists on COVID-19 duty

చంఢీఘడ్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులకు అండగా నిలిచింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వార్తల సేకరణలో నిర్విరామంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల భీమా సదుపాయం కల్పించనున్నట్టుగా ప్రకటించింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. ముంబైలో 53  మంది, చెన్నైలో 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడ కొందరు జర్నలిస్టులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

also read:78 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు, లాక్ డౌన్ ఆంక్షలు వీటికి లేవు: కేంద్రం

తమ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల భీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా  హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం నాడు ప్రకటించారు. 

ఢిల్లీలో పనిచేసే జర్నలిస్టులు కూడ తమకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కి కేంద్ర ప్రభుత్వం రూ, 50 లక్షల ఇన్సూరెన్స్ ను కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

దేశంలో కరోనా కేసులు గురువారం నాటికి 21,393కి చేరుకొన్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios