కారణమిదే: హార్థిక్‌పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Hardik Patel sentenced to two years jail in 2015 riots case
Highlights

పాటిదార్ ఉద్యమకారుడు హార్థిక్‌పటేల్ ‌కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2015 లో  జరిగిన  అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్‌కు ఈ శిక్షను విధించింది కోర్టు.


గాంధీనగర్: పాటిదార్ ఉద్యమకారుడు హార్థిక్‌పటేల్ ‌కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2015 లో  జరిగిన  అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్‌కు ఈ శిక్షను విధించింది కోర్టు.

2015లో తమ డిమాండ్ల సాధన కోసం హార్థిక్  పటేల్ మద్దతుదారులతో కలిసి  ఆందోళన నిర్వహించారు. ఈ  ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన కార్యాలయంపై దాడికి దిగారు.

పాటిదార్ల  డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా  నిరసనకారులు ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేశారు. సుమారు  5 వేలకు పైగా మంది నిరసనకారులు ఈ దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు.

బీజేపీ ఎమ్మెల్యే  రుషికేశ్  పాటిల్ కార్యాలయంపై 2015లో ఈ దాడి జరిగింది. అయితే ఈ కేసులో హార్థిక్  పటేల్ తో పాటు మరో 17 మందిపై ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి హార్థిక్‌పటేల్‌తో పాటు మరో అతని ఇద్దరు అనుచరులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 

loader