ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. కి.మీ. దూరంలో ఉన్న మరో గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఉన్నా.. ఈ గ్రామానికి లేకపోవడంతో ఇటీవలే ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిశారు. 

భువనేశ్వర్ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఆమె పుట్టిన ఊరు గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 

ఒడిశా, మయూర్‌భంజ్ జిల్లాలోని ఎన్డీయే అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. ముర్ము మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడుతో సహా దాదాపు 20 కుటుంబాలు ఈ కుగ్రామంలో నివసిస్తున్నాయని, చీకటి పడ్డాక కిరోసిన్ దీపాలపై ఆధారపడి జీవిస్తున్నారని అధికారులు తెలిపారు.

ముర్ము దివంగత అన్నయ్య భగత్ చరణ్ తుడు కుమారుడు బిరంచి రైతు. అతని భార్య, ఇద్దరు కుమారులతో అక్కడే ఉంటున్నాడు. ముర్ము కుసుమి బ్లాక్ పరిధిలోని ఉపర్బెడ గ్రామంలో జన్మించారు. సుమారు 3,500 జనాభా కలిగిన ఈ గ్రామంలో బాదాసాహి, దుంగ్రిసాహి అనే రెండు ప్రధాన కుగ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల మధ్య దూరం కేవలం ఒక కి.మీ మాత్రమే. అయితే బాదాసాహికి విద్యుత్ సరఫరా ఉండగా, దుంగ్రిసాహికి విద్యుత్ సరఫరా లేదు.

బిజెపి నాయకత్వం ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకముందే.. విద్యుత్ కనెక్షన్ కోసం స్థానికులు జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్‌కు మెమోరాండం సమర్పించారని పంచాయతీ సమితి సభ్యుడు, విద్యుత్తు లేని కుగ్రామానికి చెందిన ధనమణి బాస్కీ తెలిపారు. అతను మాట్లాడుతూ.. ‘‘ఈ నేపథ్యంలోనైనా.. వారు త్వరలో మా మనోవేదనలను వింటారని ఆశిస్తున్నాం" అన్నారు.

తమ విద్యుత్ కష్టాల గురించి చెబుతూ ‘రాత్రిపూట కిరోసిన్ దీపాలే మాకు దిక్కు. ఇక మా మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేయాలంటే.. చాలా సమస్య. దీనికోసం మేము బాదాసాహికి వెళ్లి.. అక్కడి వారిని బతిమాలుకోవాల్సి ఉంటుంది" అని బాస్కీ చెప్పారు. ఈ విషయంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, “కొన్ని ఇండ్లకు మాత్రమే విద్యుత్ లేదు. మొత్తం గ్రామానికి విద్యుత్ ను ఇచ్చే దిశగా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలో వాటికి విద్యుద్దీకరణ చేస్తాం” అని చెప్పారు.

presidential election 2022 : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు - మాయావ‌తి

ముర్ము తమ్ముడు తరణిసేన్ తుడు, 46, మాట్లాడుతూ... తన చిన్నతనంలో డుంగ్రిసాహిలో కేవలం ఐదు కుటుంబాలతో చిన్న గ్రామంగా ఉండేది. సంవత్సరాలు గడిచిన కొద్దీ ఇప్పుడు గ్రామం పెరిగింది అని చెప్పుకొచ్చాడు. “మేము బాదాషిలో పెరిగాం. మా అన్నయ్య ఇద్దరు కుమారుల్లో బీరంచి డుంగురిసాహిలో ఉంటుండగా, బ్యాంకులో పనిచేసే దులారాం బాదసాహిలో ఉంటున్నాడు’.. అని చెప్పుకొచ్చారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డిడియుజిజెవై) పథకం కింద ఉపరాబెడ గ్రామం విద్యుద్దీకరణ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, డుంగ్రిసాహి కుగ్రామం కావడం వల్ల కరెంట్ పనులు సాగలేదన్నారు. ద్రౌపది మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడుతో సహా దాదాపు 20 కుటుంబాలు ఈ కుగ్రామంలో నివసిస్తున్నాయని, చీకటి పడ్డాక కిరోసిన్ దీపాలపై ఆధారపడి జీవిస్తున్నారని అధికారులు తెలిపారు. ద్రౌపది దివంగత అన్న భగత్ చరణ్ తుడు కుమారుడు బిరంచి ఒక రైతు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు.

ద్రౌపది కుసుమి బ్లాక్ పరిధిలోని ఉపర్బెడ గ్రామంలో జన్మించింది. సుమారు 3,500 జనాభా ఉన్న ఈ గ్రామం కేవలం ఒక కి.మీ దూరంలో బాదాసాహి, దుంగ్రిసాహి అనే రెండు ప్రధాన కుగ్రామాలుగా విభజించబడింది. బాదాసాహిలో విద్యుత్తు ఉండగా, ద్రౌపది బంధువులతో సహా దాదాపు 20 కుటుంబాలు నివసించే దుంగ్రిసాహికి విద్యుత్ సరఫరా లేదు.