కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. ఆమెను సగం మేరకు పులి లేదా చిరుత పులి తినేసినట్టు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఆమె దారుణ స్థితిలో గురువారం కనిపించారు. 

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ చాలా ఫేమస్. ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు, చిరుత పులులు ఉన్నాయి. టైగర్ రిజర్వ్ చుట్టూ బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ స్థానికులు ఇప్పటికీ అలాగే నివసిస్తున్నారు. అడవి నుంచి వచ్చే అనేక సవాళ్లను వారు అధిగమిస్తూ జీవిస్తున్నారు. వీరు పలుమార్లు పులుల కంట పడటం, వాటి నుంచి బయటపడటం కూడా చాలా సార్లు చూశాం. ఈ తరుణంలో ఓ దుర్ఘటన జరిగింది.

కార్బెట్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లో నివసించే ఓ మహిళ బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె మృతదేహం సగం క్రూర జంతువు తినేసిన స్థితిలో గురువారం కనిపించినట్టు పోలీసులు తెలిపారు. బదాన్‌గడ్ కెనాల్ సమీపంలో 38 ఏళ్ల కమలా దేవీ మృతదేహం లభించింది. పారెస్ట్ గార్డులు ఆమె డెడ్ బాడీని కనిపెట్టినట్టు ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ కుమావోన్ ప్రసన్న కుమార్ పాత్రా వెల్లడించారు. ఆమెను పులి తిన్నదా? చిరుత పులి తిన్నదా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు.

Also Read: ప్రధాని మోడీ యూనివర్సిటీ డిగ్రీ కేసుపై గుజరాత్ హైకోర్టు తీర్పు రిజర్వ్

అల్మోరా జిల్లా సాల్ట్ ఏరియాలోని ఓ గ్రామంలో నివసించే కమలా దేవీ బుధవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. అయితే, ఆమెను టైగర్ తిన్నదా? లెపార్డ్ తిన్నదా? అనే విషయం తెలియదని పాత్రా వివరించారు.