Asianet News TeluguAsianet News Telugu

అడవిలో దొరికిన వెంట్రుకలు,ఎముకలు శ్రద్దావే.. డీఎన్ఏ రిపోర్టులో వెల్లడి..

శ్రద్ధా హత్య కేసులో దొరికిన వెంట్రుకలు, ఎముకలను డీఎన్‌ఏ మైటోకాన్డ్రియల్ పరీక్ష కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు అందాయని  స్పెషల్ సిపి లా అండ్ ఆర్డర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. ఈ నివేదికలో శ్రద్దా తండ్రి డీఎన్ఏ తో వాటి డీఎన్ఏ సరిపోయినట్టు వెల్లడైందని తెలిపారు.

Hair bones recovered by police from forest were of Shraddha Walkar, DNA matches with family
Author
First Published Jan 5, 2023, 6:28 AM IST

ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు విజయం సాధించారు. శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు దొరికిన జుట్టు, ఎముకలను  డీఎన్‌ఏ పరీక్ష కోసం  హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా ఆ విచారణలన్నింటి నివేదికలు పోలీసులకు అందాయి. మైటోకాన్డ్రియల్ DNA నివేదిక శ్రద్ధా వాకర్‌తో జుట్టు , ఎముకల నమూనాలు శ్రద్దా తండ్రి డీఎన్ఏ తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్ కోసం కేంద్రం నుండి ఢిల్లీ పోలీసులకు నివేదిక అందిందని స్పెషల్ సిపి లా అండ్ ఆర్డర్ సాగర్ ప్రీత్ హుడా బుధవారం తెలిపారు. ఇప్పుడు పోస్టుమార్టం చేయనున్నారు. శ్రద్ధా హత్య కేసును వేగంగా విచారిస్తున్నట్లు , తమ దర్యాప్తులో ఇప్పటివరకు చాలా ముఖ్యమైన ఆధారాలను కనుగొన్నట్టు  సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. 

దారుణ హత్య..ఆపై..

మే 18, 2022 సాయంత్రం శ్రద్ధా వాకర్ (27)ను ఆమె స్నేహితుడు, లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపాడు. ఆపై ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. దీని తరువాత.. ఆ ముక్కలను కొన్ని రోజులు పాటు తన ఇంటి రిఫ్రిజిరేటర్లో ఉంచాడు. ఆ తరువాత ఆ శరీర భాగాలను మెహ్రౌలీ , గురుగ్రామ్ అడవుల ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా వాకర్ తండ్రి తన మిస్సింగ్ రిపోర్టును దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. అఫ్తాబ్ ను నవంబర్ 12న దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.  విచారణ నిందితుడు చెప్పిన సమాధానాలకు పోలీసులు కంగు తిన్నారు. ఈ హత్య మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమైన ఢిల్లీ పోలీసులు మెహ్రౌలీ, గురుగ్రామ్ అడవుల నుండి ఆమె ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని  DNA పరీక్ష కోసం శ్రద్ధ తండ్రి వికాస్ వాల్కర్ DNA తో సరిపోలడం, మ్యాచ్ జరిగింది.

మెహ్రౌలీ, గురుగ్రామ్ అడవుల నుండి దవడ, తొడ ఎముక, కొన్ని ఇతర శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ ఎముకలన్నింటినీ ఢిల్లీ పోలీసులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. నిందితులకు శిక్ష పడేలా చేయడంలో పోలీసులకు ఈ డీఎన్‌ఏ నివేదిక ఎంతో కీలకం కానుంది. సమాచారం ప్రకారం..దర్యాప్తు సమయంలో ఢిల్లీ పోలీసు బృందానికి చాలా ఆడియోలు కూడా వచ్చాయి, అవి చాలా ముఖ్యమైన సాక్ష్యంగా పరిగణించబడుతున్నాయి.

హత్యకు గల కారణాలను నిగ్గుతేల్చేందుకు హత్యకు సంబంధించిన విచారణకు ఈ ఆడియో ఎంతగానో ఉపకరిస్తుందని విచారణతో సంబంధం ఉన్న అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ ఆడియోతో సరిపెట్టేందుకు ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ వాయిస్ శాంపిల్‌ను కూడా తీసుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడికి  పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలు కూడా చేశారు. విచారణలో నిందితుల ఆదేశాల మేరకు పోలీసులు మెహ్రౌలీ అటవీప్రాంతం, గురుగ్రామ్ నుండి కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios