పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంట్లోకి ప్రవేశించేందుకు అతను ఏడుసార్లు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు
కోల్‌కత్తా:పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీఎం మమత బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు అతను ఏడుసార్లు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. హఫీజుల్ ముల్లాను సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. ఆయనకు జూలై 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు
హఫీజుల్ వద్ద బంగ్లాదేశ్ కు చెందిన సిమ్ కార్డుతో పాటు 11 పిమ్ కార్డులను గుర్తించామని పోలీసులు చెప్పారు. సీఎం మమత బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె ఇంటి వద్ద ఏడెనిమిది దఫాలు రెక్కీ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తమ ద్యాప్తులో హఫీజుల్ ముల్లా ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు.బంగ్లాదేశ్, జార్ఖండ్, భీహార్, గుజరాత్, ముంబైలకు పలుమార్లు హఫీజుల్ ముల్లా ఫోన్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని లోతుగా విచారించేందుకు గాను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
గత ఏడాది దుర్గామాత నిమజ్జనం సందర్భంగా హఫీజుల్ ముల్లా బంగ్లాదేశ్ కు పడవలో వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. హోలీ, రథయాత్ర సందర్భంగా స్థానికంగా ఉన్న పిల్లలకు చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఇచ్చి వారితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మమత బెనర్జీ రూట్ మ్యాప్ వంటి విషయాలను తెలుసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హఫీజుల్ ముల్లా ఫోన్ లో ఏ రకమైన సమాచారం ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గతంలో హఫీజుల్ ముల్లా రాష్ట్ర సచివాలయం నబన్నాలోకి ప్రవేశించాడు. ఈ నెల 4వ తేదీన సీఎం మమత బెనర్జీ ఇంట్లోకి హఫీజుల్ ముల్లా ప్రవేశించాడు. అయితే ఆ రోజు నుండి సెక్రటేరియట్ తో పాటు సీఎం మమత బెనర్జీ నివాసం వద్ద ఉన్న పోలీసులు కూడా సెల్ ఫోన్లు వినియోగించడంపై నిషేధం విధించారు.
సీఎం మమత బెనర్జీ నివాసంలోకి ఇనుప రాడ్ తో హఫీజుల్ ముల్లా ప్రవేశించారు.ఈ విషయమై భద్రత లోపాలపై విచారణ చేసేందుకుు గాను జాయింట్ పోలీస్ కమిషనర్ మురళీధర్ శర్మ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం., ఈ సిట్ లో ఎనిమిది మంది సభ్యులున్నారుఈ నెల 2వ తేదీ రాత్రి 3 తేదీ తెల్లవారుజాము వరకు సీఎం నివాసంలోనే అతను ఉన్నారు. ఈ నెల 3న ఉదయం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించే వరకు అతను అక్కడే ఉన్నాడు.
also read:గుజరాత్ లో దంచికొడుతున్న వానలు.. ఆస్పత్రిని ముంచెత్తిన వరద.. 8 మంది మృతి
గత ఏడాది అతను బంగ్లాదేశ్ కు వెఁళ్లిన సమయంలో అక్కడ ఏం చేశాడనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముల్లాకు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధాలు ఉన్నట్టుగా సూచనలున్నాయి. కానీ ఇంకా ఏదీ నిర్ధారణ కాలేదని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.సీఎం కు కల్పించే జడ్ ప్లస్ సెక్యూరిటీని తప్పించుకుని అతను సీఎం నివాసంలోకి ఎలా వచ్చాడనే విషయమై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
