ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాతే. ప్రధాని తన ఇమేజ్‌ను పెంచుకునే ఈవెంట్‌ను పూర్తి చేశారని ఆమె విమర్శించారు. భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం యువత అని, కానీ ఆ క్రెడిట్‌ను ప్రధాని తన ఖాతాలో వేసుకున్నారంటూ సుప్రియ సెటైర్లు వేశారు.
ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాతే. ప్రధాని తన ఇమేజ్‌ను పెంచుకునే ఈవెంట్‌ను పూర్తి చేశారని ఆమె విమర్శించారు.
భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం యువత అని, కానీ ఆ క్రెడిట్‌ను ప్రధాని తన ఖాతాలో వేసుకున్నారంటూ సుప్రియ సెటైర్లు వేశారు. బిహార్ ఎన్నికల కోసమే ప్రధాని ఇదంతా చేశారని.. కోవిడ్ నియంత్రణకు సరైన చర్యలు లేవని, వైఫల్యాలను అంగీకరించనూ లేదని సుప్రియ విమర్శించారు.
యువత ఎక్కువగా ఉన్న దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందన్న క్రెడిట్ తీసుకున్నారని ఆమె సెటైర్లు వేశారు. మీడియా సైతం ప్రశ్నలు అడగకుండా మిషన్ పూర్తి చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read:పండుగల సీజన్ లో జాగ్రత్త, వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: కరోనాపై మోడీ
కాగా ప్రధాని మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు.
అదే విధంగా కరోనా ప్రభావిత దేశాలైన అమెరికా, బ్రెజిల్‌లో మరణాల రేటు అధికంగా ఉందని, భారత్‌లో మాత్రం తక్కువగా ఉందని మోడీ గుర్తుచేశారు. సామాజిక దూరం, మాస్కు ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకుంటామని మోడీ హెచ్చరించారు.
