హ్యాకింగ్ అలర్ట్ మెసేజులు : ఆపిల్ అధికారులకు సమన్లివ్వనున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ !!

యాపిల్ ఫోన్ హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ ల నేపథ్యంలో పార్లమెంటు ప్యానెల్ ఆపిల్ అధికారులను పిలిపించి మాట్లాడడానికి యోచిస్తోంది. 

Hacking Alert Messages : Parliamentary Standing Committee to Summon Apple Officials - bsb

ఢిల్లీ : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగం.. ఐపిల్ ఐఫోన్ హాకింగ్ అలర్ట్ మెసేజ్ ల అంశాన్ని పరిష్కరించే దిశగా నడుం బిగించింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకులకు, దేశంలోని ఇతర ప్రజాప్రతినిధులకు ఐఫోన్‌ పంపిన "రాష్ట్ర ప్రాయోజిత దాడుల"హెచ్చరికల అంశాన్ని ఊటింకిస్తూ ఆపిల్ అధికారులకు సమన్లు ఇచ్చే యోచనలో ఉంది. దీనికి సంబంధంచి వచ్చే సమావేశంలో హాజరై వివరణ ఇవ్వాలని ఆపిల్ అధికారులను పిలిపించడాన్ని పరిశీలిస్తున్నట్లు కమిటీ సెక్రటేరియట్ అధికారిని ఉటంకిస్తూ ఏఎన్ ఐ కథనం. 

ఈ అంశంమీద కమిటీ సెక్రటేరియట్ 'తీవ్ర ఆందోళన' వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని 'అత్యంత సీరియస్‌గా' వ్యవహరిస్తోంది" అని అధికారి తెలిపారని తెలిపింది. 

ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ : యాపిల్ నుంచి కాకుండా ఎన్జీవో నుంచి మెసేజ్ లు !.. ఏం జరుగుతోంది??

తమ ఐఫోన్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు "స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్స్"పై ఆపిల్ నుండి నోటిఫికేషన్‌లు అందాయని పలువురు ప్రతిపక్ష నాయకులు చెప్పడంతో మంగళవారం వివాదం చెలరేగింది. దీంతో ప్రభుత్వమే ఈ హ్యాకింగ్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరుపుతుందని పేర్కొంది.

అలాంటి నోటిఫికేషన్‌లు అందుకున్న వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేతలు శశి థరూర్, పవన్ ఖేరా, కెసి వేణుగోపాల్, సుప్రియా శ్రీనాట్, టిఎస్ సింఘ్‌దేవ్, భూపిందర్ సింగ్ హుడా ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్.

శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాఘవ్ చద్దా, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సహాయకులకు కూడా ఆపిల్ నుండి మెసేజ్ లు వచ్చాయి. థింక్-ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ప్రెసిడెంట్ సమీర్ శరణ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్ డీ, ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ కూడా ఇలాంటి హెచ్చరికలను అందుకున్నవారిలో ఉన్నారు.

వివాదం ఊపందుకోవడంతో ఆపిల్ స్పందించింది. ఒక ప్రకటన వెలువరిస్తూ.. ఇది  "బెదిరింపు నోటిఫికేషన్‌లను ఏదైనా నిర్దిష్ట రాష్ట్ర-ప్రాయోజిత దాడికి ఆపాదించలేం" అని పేర్కొంది. "నోటిఫికేషన్‌లు ఫాల్స్ అలార్మ్ కావచ్చు" అని కూడా తెలిపింది. ప్రభుత్వం, ఆందోళన చెందిందని, ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించామనిపేర్కొంది.

ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడిని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ పురోగతిని తట్టుకోలేక ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios