Asianet News TeluguAsianet News Telugu

Gyanvapi Mosque : వాస్తవాలు బయటకు రావాలి.. సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేం - ఆర్‌ఎస్‌ఎస్

జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫిక్ స‌ర్వే, శివ‌లింగం లభించిన అంశాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. ఈ విషయంలో నిజాలు భయటకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. చారిత్రాక వాస్తవాలను సరైన కోణంలో చూడాలని చెప్పింది. 

Gyanvapi Mosque : The facts must come out .. The truth cannot be hidden for long - RSS
Author
New Delhi, First Published May 19, 2022, 10:51 AM IST

కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన వాస్తవాలు ప్రజల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పేర్కొంది. స‌త్యాన్ని ఎక్కువ కాలం దాచలేమని తేల్చిచెప్పింది. జ్ఞాన్‌వాపి మసీదు స‌ర్వే, శివ‌లింగం వెలికితీత అంశాల‌పై ఆర్ఎస్ఎస్ మొద‌టి సారిగా ఆర్ఎస్ఎస్ స్పందించింది. 

“ కొన్ని వాస్తవాలు బహిరంగంగా వస్తున్నాయి. వాస్తవాలు బయటికి రావాలని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనప్పటికీ, నిజం ఎప్పుడూ బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. మీరు దానిని ఎంతకాలం దాచగలరు? సమాజం ముందు చారిత్రక వాస్తవాలను సరైన కోణంలో ఉంచాల్సిన సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను ’’అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ఇన్‌ఛార్జ్ సునీల్ అంబేకర్ అన్నారు.

వందేళ్ల చరిత్ర కలిగిన క్లబ్ వాష్ రూంలో రహస్యంగా వీడియో.. హైకోర్టులో మైనర్ బాలిక ఫిర్యాదు...

జర్నలిస్టులను సన్మానించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మసీదు సముదాయంలో వీడియోగ్రాఫిక్ సర్వేలో ‘శివలింగం’ కనిపించిందని కొందరు హిందూ పిటిషనర్లు పేర్కొన్నప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని అన్నారు.

“ ఈ ఘటనలు జరిగినప్పుడు నేను వారణాసిలో ఉన్నాను. భావోద్వేగానికి గురయ్యాను. అయితే నంది (శివుడు వాహనంగా భావించే ఎద్దు) శివుడి కోసం శతాబ్దాలుగా ఎదురుచూస్తోందని ఒక విలేకరి చెప్పినప్పుడు నేను మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నా కళ్ళు చెమర్చాయి. అందుకే జర్నలిజానికి అంత ప్రాధాన్యం. ఇది ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తుంది ” అని బల్యాన్ అన్నారు. 

నదిలో స్నానం చేస్తుండగా.. 38యేళ్ల వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి...

మథురలోని జ్ఞాన్‌వాపి మసీదు, షాహీ ఈద్గాకు సంబంధించిన ప్రశ్నకు RSS చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. రామజన్మ భూమి ఉద్యమంతో సంఘ్ దాని చారిత్రక ప్రాముఖ్యత కారణంగా సంబంధం కలిగి ఉందని అని అన్నారు. అయితే ఈ అంశం మినహాయింపు అని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తర్వాత ‘‘ ఇప్పుడు మనం మళ్లీ మానవాభివృద్ధితో ముడిపడి ఉంటాము. ఈ ఉద్యమం మాకు ఆందోళన కలిగించదు ’’ అని భగవత్ అన్నారు. 

జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాల ఎదుట రోజువారీ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహిళల బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు విచారిస్తోంది. అయితే మసీదు ఆవరణలో శివలింగం ల‌భించిన త‌రువాత వజుఖానా పక్కన ఉన్న గోడను కూల్చివేయాలని అదే కోర్టులో దరఖాస్తు దాఖలు అయ్యింది. 

కాగా.. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో మూడు రోజుల పాటు కోర్టు పర్యవేక్షణలో వీడియోగ్రఫీ సర్వే మే 16న ముగిసింది. జ్ఞాన్‌వాపి మసీదు కేసును కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. న్యాయమూర్తులు DY చంద్రచూడ్ మరియు PS నరసింహలతో కూడిన ధర్మాసనం మే 17వ తేదీన శివలింగం ఉన్న ప్రాంతాన్ని రక్షించి, సీల్ చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. నమాజ్ చేయడానికి ముస్లింలను మసీదులోకి ప్రవేశించకుండా నిరోధించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మసీదు ఐకానిక్ కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios