వందేళ్ల చరిత్ర కలిగిన ఓ క్లబ్ లో తనను రహస్యంగా వీడియో చిత్రీకరించారని ఓ మైనర్ బాలిక హైకోర్టును ఆశ్రయించింది. దీనిమీద విచారణ జరిపించాలని.. అసలేం జరిగిందో చెప్పాలని కోర్టు క్లబ్ అధికారులను కోరింది. 

రాజస్థాన్ : Jodhpurలోని ప్రముఖ క్లబ్ లోని washroom లో ఓ వ్యక్తి రహస్యంగా కెమెరా పెట్టి తనను చిత్రీకరించాడని ఓ Minor girl రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన ఉదంతం సంచలనం రేపింది. ఉమెద్ క్లబ్ లో వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు తనను ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో తీశాడని... దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ మైనర్ బాలిక హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని బాలిక డిమాండ్ చేసింది. ఏప్రిల్ 24వ తేదీన బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి క్లబ్ వెళ్ళింది. ఈత కొట్టిన తర్వాత వాష్ రూమ్ లో దుస్తులు మార్చుకుంటుండగా గోడకు అవతలి వైపు నుంచి ఎవరో రహస్యంగా వీడియో చిత్రీకరించడాన్ని బాలిక గమనించి అరుపులు, కేకలు పెట్టింది. వీడియో తీసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా క్లబ్ లో వ్యక్తులు పట్టుకున్నారు.

ఆ తరువాత బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్లబ్ కు వచ్చారు. అయితే, క్లబ్బు ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున పోలీసులను తిరిగి వెళ్ళమని క్లబ్ ఆఫీస్ బేరర్లు కోరారు. వీడియో చిత్రీకరణ విషయాన్ని తాము క్లబ్లో అంతర్గతంగా సమస్యను పరిష్కరించుకుంటామని క్లబ్ నిర్వాహకులు తెలిపారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నా వీడియో తీసిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితుడికి అనుకూలంగా ఉన్నారని బాధిత బాలిక తల్లి క్లబ్ ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులు, వీడియో తీసిన నిందితుడిపై ఉదయ్ మందిర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విపుల్ సింఘ్వి తెలిపారు. 

రాజీకి అంగీకరించమని బాధితురాలిని బలవంతం చేశారని... విచారణ పూర్తయ్యేవరకు ఫోన్ క్లబ్‌లోనే ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ నిందితుడికి మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేశారని విపుల్ సింఘ్వి ఆరోపించారు. ఉమెద్ క్లబ్ను 1922లో అప్పటి జోధ్పూర్ పాలకుడు స్థాపించారు. నిందితుడితో దర్యాప్తు అధికారికి వ్యక్తిగత సంబంధాల కారణంగా పోలీసులు ఈ అంశాన్ని సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే కారణంతో క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ ను కోర్టులో వేసినట్లు పిటిషనర్ అయిన బాలిక తల్లి తరఫు న్యాయవాది Vipul సింగ్ తెలిపారు. జోద్పూర్ బెంచ్ లోని జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ బుధవారం ఉమెద్ క్లబ్ కు నోటీసు జారీ చేశారు. అక్కడ ఏప్రిల్ 24న జరిగిన ఘటనపై కేసు డైరీకి సంబంధించిన వాస్తవాల నివేదిక సమర్పించాలని విచారణ అధికారికి కోర్టు సమన్లు జారీ చేసింది.