Asianet News TeluguAsianet News Telugu

జ్ఞానవాపి మసీదు కేసు: సీల్డ్ కవర్లో కోర్టుకు సర్వే రిపోర్ట్, వారణాసి కోర్టుకు సుప్రీం కీలక ఆదేశం

జ్ఞానవాపి మసీదు  కేసుకు సంబంధించిన సర్వే రిపోర్టును ఇవాళ ఉదయం వారణాసి కోర్టుకు విశాల్ సింగ్ బృందం  గురువారం నాడు అందించింది. రెండు రోజుల క్రితమే ఈ సర్వే రిపోర్టును ఇవ్వాల్సి ఉండగా సమయం కావాలని కోరడంతో  రెండు రోజుల గడువును ఇచ్చారు.

Gyanvapi Mosque Case:Commission files survey report in Varanasi court
Author
New Delhi, First Published May 19, 2022, 11:26 AM IST

న్యూఢిల్లీ: Gyanavapi Mosque లో  సర్వే రిపోర్టును  ను వారణాసి కోర్టుకు  కమిషన్ గురువారం నాడు ఉదయం సమర్పించింది. Vishal Singh  నేతృత్వంలోని Survey  బృందం ఈ రిపోర్టును కోర్టుకు అందించింది.  సీల్డ్ కవర్లో రిపోర్టును కోర్టుకు అందించారు విశాల్ సింగ్. మరో వైపు ఇవాళ  జ్ఞానవాపి మసీదు వివాదంపై Varanasi కోర్టులో విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.  రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

  కాశీ విశ్వనాథ ఆలయం- జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయాలని కోర్టు  ఇదివరకే కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ సర్వే రిపోర్టులో కొన్ని కీలక అంశాలను మీడియాకు లీక్ చేయడంతో సర్వే కమిటీ నుండి అజయ్ మిశ్రాను తొలగించారు. రెండు రోజుల్లో నివేదికను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజులు ఇవాళ్టికి పూర్తి కానుంది. ఇవాళ ఉదయం కోర్టు ప్రారంభం కాగానే కమిషన్ సభ్యులు సర్వే రిపోర్టును అందించారు.

ఈ సర్వే రిపోర్టును  రవికుమార్ దివాకర్ కోర్టులో సమర్పించారు.  జ్ఞానవాపి మసీదు వ్యవహరంలో విచారణను ఈ నెల 20వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు ఫిర్యాదుదారులు మరింత సమయం కోరడంతో  ఇవాళ విచారణను నిర్వహించవద్దని కూడా వారణాసి కోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

also read:జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు: శివలింగానికి రక్షణ ఇవ్వాలి, నమాజ్‌కి అనుమతి

విశాల్ సింగ్ నేతృత్వంలోని  ప్రత్యేక కమిషనర్ మూడు పెట్టెలను వారణాసి కోర్టుకు సమర్పించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన వీడియో రికార్డులను  ఈ పెట్టెల్లో భద్రపర్చారు.

జ్ఞానవాపి కాంప్లెక్స్ లో గల బావిలో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సంరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని  సుప్రీంకోర్టు ఈ నెల 17న  ఆదేశించింది.   ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.  వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

డివై చంద్రచూడ్, నర్సింహలతో కూడిన ధర్మాసనం మరో వైపు  నమాజ్ చేసుకొనేందుకు కూడా ముస్లింలకు అనుమతిని ఇచ్చింది.  వారణాసి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్నింటికి సవరణలు ఇచ్చింది.  రెండింటిపై స్టే కూడా విధించింది. 

వారణాసి కోర్టు మాత్రం 20 మంది మాత్రమే నమాజ్ చేసుకొనేందుకు  అనుమతి ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎంత మందైనా నమాజ్ చేసుకొనేందుకు అనుమతిని  ఇచ్చింది.  ఈ  కేసు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పిటిషన్ దాఖలు చేసిన వారికి  నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది.

వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్‌ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం  విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది.  పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది హుఫేజా అహ్మది వాదనలు వినిపించారు.

మసీదు కమిటీ తరపు సీనియర్ న్యాయవాది అహ్మదీ వాదించారు., కమిషనర్ నియామకంతో సహా ట్రయల్ కోర్టు యొక్క అన్ని ఉత్తర్వులపై స్టేను కోరుతున్నట్లు తెలిపారు. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా,  పార్లమెంటుకు విరుద్ధంగా ఉన్నందున ‘స్టేటస్ కో’కు ఆదేశించాలని కోరారు. అంతేకాదు పిటిషనర్ల ఉద్దేశం మసీదును మాయ చేసే కుట్రగా స్పష్టం అవుతోందంటూ కోర్టుకు తెలిపారు.

వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించలేదు.శివలింగం ఉన్నట్టు నివేదించిన ప్రదేశానికి తగిన రక్షణ కల్పించాలని డీఎం వారణాసిని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజుమియా మసాజిద్ వేసిన పిటిషన్ పై హిందూ పిటిషనర్లు,యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ లోపుగా సమాధానాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు ఈ కేసులో వీడియోగ్రఫీ సర్వే రిపోర్టును మీడియాకు బయటపెట్టిన అజయ్ మిశ్రాను సర్వే రిపోర్టు నుండి కోర్టు తప్పించింది. మరో వైపు సర్వేను పూర్తి చేసేందుకు గాను  రెండు రోజుల సమయాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ వారణాసి కోర్టులో సర్వే రిపోర్టును అందించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios