Asianet News TeluguAsianet News Telugu

gyanvapi masjid case : సుప్రీం సంచలన ఆదేశాలు.. విచారణ వారణాసి జిల్లా కోర్టుకి బదిలీ

వివాదాస్పద వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కోర్టులో అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి వున్నారని సుప్రీం తెలిపింది. 
 

gyanvapi masjid case : supreme court Transfers Case To varanasi District Judge
Author
New Delhi, First Published May 20, 2022, 4:27 PM IST

వివాదాస్పద వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో (gyanvapi masjid case ) సుప్రీంకోర్టు (supreme court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కోర్టులో అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి వున్నారని సుప్రీం తెలిపింది. 

ఇకపోతే.. జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కోర్టు తన తీర్పును వెలువరించే వరకు సర్వేలో దొరికిన శివలింగాన్ని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు అప్పగించాలని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే బుధవారం డిమాండ్ చేశారు.జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో బాబా విశ్వేశ్వర్ విగ్రహం దొరికితే అది ‘వాజుఖానా’ ఎలా అవుతుందని ఆయ‌న ప్రశ్నించారు. మ‌న పురాణాలు జ్ఞాన్‌వాపి ఆలయం, అక్కడ ఉంచిన జ్యోతిర్లింగం విష‌యం కుప్తంగా పేర్కొన్నాయ‌ని తెలిపారు. నేటి జ్ఞాన్ వాపి మసీదు మన గ్రంథాలలో పేర్కొన్న ఆలయ సముదాయంలో ఒక భాగం అనడంలో ఎలాంటి సందేహమూ లేద‌ని అన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. గర్ గౌరి కాంప్లెక్స్ లోపల ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే 17 న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది. నమాజ్ చేయడానికి మసీదులోకి ముస్లింలు ప్రవేశించకుండా నిరోధించవద్దని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అధికారులను ఆదేశించింది. వారణాసి కోర్టు ఆదేశించిన సర్వేలో పాల్గొన్న హిందూ పక్షం జ్ఞాన్‌వాపి మసీదు లోప‌ల వజుఖానా స్థలంలో శివలింగం దొరికిందని పేర్కొంది.

ALso Read:Gyanvapi Mosque : వాస్తవాలు బయటకు రావాలి.. సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేం - ఆర్‌ఎస్‌ఎస్

అయితే వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ ఈ వాదనలను తోసిపుచ్చింది. ఇది శివలింగంగా హిందూ పక్షం చెబుతున్న ఫౌంటెన్ అని పేర్కొంది. కాగా జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించిన వారణాసి కోర్టు జిల్లా సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ సర్వే నివేదికను దాఖలు చేయడానికి కమిషన్ కు మ‌రో రెండు రోజుల గడువు ఇచ్చారు. 

కాశీ విశ్వనాథ దేవాలయం, జ్ఞానవాపి మసీదు అంశంపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, అన్యాయం,  చట్టవిరుద్ధమని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అన్నారు. అంత‌కు ముందు అంటే రోజు వారణాసి కోర్టు.. కాంప్లెక్స్ లోపల సర్వే చేసే ప్రదేశానికి సీలు వేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అక్కడ సర్వేయింగ్ బృందం శివలింగాన్ని కనుగొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు సముదాయంలోని కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వే మూడవ రోజు సోమవారం ముగియడంతో, ఈ కేసులో హిందూ పిటిషనర్, సోహన్ లాల్ ఆర్య కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios