Rosie Rahman: సంప్రదాయ దుస్తుల్లో మోడలింగ్ చేసి ప్రశంసలు అందుకున్న ప్రముఖ మోడల్ రోజీ రెహమాన్.. మోడలింగ్ అంటే విదేశీ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేయడమే కాదు. రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన పాత్ర పోషించగలుగుతోంది.
Rosie Rahman: అస్సాంకు చెందిన ప్రముఖ మోడల్ రోజీ రెహమాన్ మోడలింగ్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది. మోడలింగ్ అంటే అన్యదేశ దుస్తులతో ర్యాంప్ వాక్ చేయడమే కాదని, సంప్రదాయ దుస్తుల్లో మోడలింగ్ చేసి ప్రశంసలు అందుకుంది. అలాగే.. రోజీ రెహమాన్ రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర పోషించగలనని నిరుపించారు.
గువాహటికి చెందిన రోజీ రెహమాన్ అవాజ్‌ది వాయిస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. 'నేను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. నేను ఎప్పుడూ కొత్త బట్టలు ధరించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడూ మోడల్ కావాలని అనుకోలేదు.నాకు డ్యాన్స్, పాటలు పాడటమంటే..చాలా ఇష్టం. అలాగే.. చాలా ఆసక్తి'అని పేర్కొంది.
ఆమె తన స్నేహితురాలు రీతూ గొగోయ్, హేమలతా చెటియా ప్రోత్సహంతో ఒక మ్యాగజైన్ కోసం మోడలింగ్ చేశారంట. ఇలా ఆమె అస్సామీ మ్యాగజైన్‌కు కవర్ మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలోని ప్రవేశించింది. ఆ తరువాత నందిని, సఖి మ్యాగజైన్‌లకు మోడల్‌గా చేయడం. ఆ వెంటనే 'నామ్ అనే బొటిక్ నుంచి జూట్ షో చేయమని ఆఫర్ రావడం. ఆ తర్వాత డా.నమ్రతా శర్మ తనని మరో షో చేయమని అడగడం ఇలా క్రమంగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయని తెలిపింది.
రోజీ రెహమాన్.. మేఖేలా చాదర్‌తో సహా వివిధ సొగసైన సాంప్రదాయ దుస్తులను ధరించి అనేక జాతీయ, రాష్ట్ర అందాల పోటీలను గెలుచుకున్నారు. సొగసైన, సాంప్రదాయ దుస్తుల అందంపై ఆమెకు గట్టి నమ్మకం. ఆమె మాటల్లోనే.. ' అందమైన దుస్తులు ధరించడం ద్వారా ఫ్యాషన్ వర్డల్ లో విజయం సాధిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ గౌనులు, మేఖేలా-చాదర్‌ల వంటి అందమైన దుస్తులతోనే స్టేజ్‌పైకి వెళ్తాను. నేను ర్యాంప్‌లు, స్టేజీలు నడిచాను. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో పాల్గొని పలు అవార్డులను గెలుచుకున్నాను' అని తెలిపారు.
రోజీ రెహమాన్ మోడలింగ్ రంగంలో ఎన్ని అవార్డులు అందుకున్నారు. మోస్ట్ బ్యూటిఫుల్ మోడల్ 2021, రెడ్ కార్పెట్ బ్యూటిఫుల్ క్వీన్ వరల్డ్ బ్యూటీ పేజెంట్ 2021, ఇంటర్నేషనల్ గ్లోబల్ యూనివర్స్ 2022, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఛత్తీస్‌గఢ్ 2022, మిసెస్ ఇ ఇంటర్నేషనల్ అంబాసిడర్, శ్రీమతి గ్లోబల్ ఢిల్లీ, శ్రీమతి 2023 హర్యానా వంటి పురస్కారాలను పొందారు. మిస్ స్టార్ యూనివర్స్ 2023, MSSF ఢిల్లీ అవార్డ్స్ 2023, భారత్ గౌరవ్ అవార్డ్స్ 2023, మిసెస్ పాపులర్ ఫేస్ ఆఫ్ ఇండియా 2023, మోస్ట్ ప్రెస్టీజియస్ మోడల్ ఆఫ్ ది ఇయర్ వంటి మొత్తం 11 టైటిళ్లను గెలుచుకున్నారు.
'కుటుంబం, స్నేహితుల మద్దతు లేకుండా దేనిపైనా దృష్టి పెట్టడం అసాధ్యమని నేను అనుకుంటున్నాను. ముస్లిం సమాజంలో స్త్రీలు ఎప్పుడూ ముసుగులో ఉండాలనే అపోహ ఉంది. కానీ, నా కుటుంబం నుండి, సమాజం నుండి నాకు అలాంటి అడ్డంకులు ఎదురు కాకపోవడం నా అదృష్టం. నా భర్త ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. నా స్నేహితులు కూడా చాలా సపోర్ట్ చేశారు" అని రోజీ రెహమాన్ ఆవాజ్-ది వాయిస్‌తో అన్నారు.
రోసీ కేవలం ఫ్యాషన్ ప్రపంచానికే బంధీ కాలేదు..మరో వైపు.. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆమె ప్రస్తుతం ఉమెన్స్ నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సాంస్కృతిక సంస్థ బిహు సురక్ష మంచ్ అస్సాం, సాంస్కృతిక మహాసభ అస్సాం, రంగదాలి సంస్కార్ సంస్థాన్, సంస్కార్ సంస్థ 'సత్సరి' మొదలైన సంస్థల్లో చురుకుగా పాల్గొంటుంది. ఎంతో మందికి చేయూతనిస్తోంది.
"ఈ రోజుల్లో అస్సాం ఫ్యాషన్ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. అస్సామీ సంస్కృతిలో రంగురంగుల దుస్తులు కూడా ఫ్యాషన్ ప్రపంచంలోకి వస్తున్నాయి. అస్సాం సాంప్రదాయ మేఖేలా-చాదర్ స్వదేశంలోనూ.. అటు విదేశాలలోనూ చాలా ఇష్టపడతారు. ఈ రంగంలో చాలా మంది వ్యక్తులు స్వయం శక్తితో ముందుకు వచ్చారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.' అని అస్సామీ మోడల్ రోజీ రెహమాన్ అంటారు.
