Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : నల్ల బొగ్గులా మారిన మహిళ చేయి.. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్..

కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులొచ్చాయి. ఆమె కుడి చేయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులు మార్చారు. 

Gurugram hospital under scanner after woman's hand turns black - bsb
Author
Hyderabad, First Published May 31, 2021, 10:00 AM IST

చండీఘడ్ లో దారుణం చోటు చేసుకుంది. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన వినిత, సర్పరాజ్ లు దంపతులు. అయితే, వినిత దుండహోరా గ్రామంలోని పార్క్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్ 23న అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇచ్చారు. 

అయితే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులొచ్చాయి. ఆమె కుడి చేయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులు మార్చారు. 

అయినా ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆమెను ఎక్స్ రే తీశారు. దీంట్లో ఆమె చేయి నల్లగా మారడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్ కు గురైందని తెలిసింది. కాగా, ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలలని పార్క్ వైద్య సిబ్బంది సలహా ఇచ్చారు. 

గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్.. పోలీసులకు చిక్కిన మెహుల్ చోక్సీ...

గర్భస్రావం తరువాత అధిక మోతాదులో యాంటీ బయోటెక్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే తన భార్యకు ఇలా జరిగిందని సర్పరాజ్ ఆరోపించాడు. కాగా, తన భార్యను తీసుకుని వెంటనే ఢిల్లీలోని ఆస్పత్రికి చేరుకున్నాడు. వినితను అక్కడి వైద్యులు పరీక్షించారు. ఆమె కుడిచేయి పూర్తిగా ఇన్ ఫెక్షన్ కు గురైందని వెంటనే తొలగించాలని తెలిపారు.

దానికోసం చాలా ఖర్చు అవుతుందని కూడా తెలిపారు. అసలే.. కోవిడ్ కారణంగా సర్పరాజ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చానని చెప్పాడు. కాగా, వీరికి ఒక ఎన్జీవో ఆహారారన్ని అందిస్తుంది. 

తాను ఆపరేషన్ కు అయ్యే ఖర్చు కూడా భరించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఈ దారుణంపై గురుగ్రామ్ చీప్ మెడికల్ ఆఫీసర్ ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios