Asianet News TeluguAsianet News Telugu

ఔరంగజేబు ఉగ్రవాదానికి గురు గోవింద్ సింగ్ ఎదురు నిలిచారు - ప్రధాని నరేంద్ర మోడీ

గురు గోవింద్ సింగ్ ఔరంగజేబు ఉగ్రవాద చర్యలకు గట్టిగా ఎదురునిలబడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మొఘల్ చక్రవర్తి ప్రణాళికలను అడ్డుకున్నారని చెప్పారు. 

Guru Gobind Singh stood against Aurangzeb's terrorism - Prime Minister Narendra Modi
Author
First Published Dec 26, 2022, 4:39 PM IST

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ గట్టిగా నిలబడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చివరి సిక్కు గురువు గురు గోవింద్ సింగ్, ఆయన కుమారులు (సాహిబ్జాదేస్), మాతా గుజ్రీ జీ జ్ఞాపకార్థం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.

మాస్క్ తప్పనిసరి.. రాత్రి 1 గంటల వరకే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: కర్ణాటక ప్రభుత్వ ప్రకటన

ఔరంగజేబు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ పర్వతంలా నిలబడ్డారని, భారతదేశాన్ని మార్చాలనే తన ప్రణాళికలకు అడ్డునిలిచారని చెప్పారు. ఔరంగజేబు, ఆయన ప్రజలు గురు గోవింద్ సింగ్ పిల్లల మతాన్ని ఖడ్గ బలంతో మార్చాలనుకున్నారని ప్రధాని తెలిపారు. ‘‘సిక్కు గురు సంప్రదాయం కేవలం విశ్వాసం, ఆధ్యాత్మికత సంప్రదాయం కాదు. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచన ప్రేరణకు కూడా మూలం. భారతదేశ భవిష్యత్తు తరం ఎలా ఉంటుందనేది ఆ స్ఫూర్తిపై ఆధారపడి ఉంటుంది. ’’ అని అన్నారు.

అంగుళం భూమిని కూడా వ‌దులుకోం.. క‌ర్నాట‌క-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు వివాదంపై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కీల‌క వ్యాఖ్యలు

కాగా.. దేశంలోనే తొలిసారిగా వీర్ బల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహిబ్జాదీల ఆదర్శప్రాయ ధైర్యసాహసాలపై పౌరులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటరాక్టివ్ భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించింది.ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌గా జరుపుకుంటామని ఈ ఏడాది జనవరి 9న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

గురుగోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌లు 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనలో ఉరితీయబడ్డారు. చారిత్రక కథనాల ప్రకారం.. గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ లను ఔరంగజేబు సైనికులు బంధించి బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. కానీ ఇద్దరూ అందుకు నిరాకరించారు. దీంతో వారిని సజీవదహనం చేశారు. ఆ అమరవీరులను స్మరించుకునేందుకు డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’గా జరుపుకుంటామని ప్రధాని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios