అందరి ముందూ..ప్రతి విషయంలో తనను చులకన చేసి మాట్లాడుతోందని.. తన పురువు తీసి అవమానిస్తోందని ఓ భర్త తన కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న ఆమెను కసితీరేలా 40సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుడ్ గావ్ కి చెందిన పంకజ్(28)కి ఢిల్లీకి చెందిన వన్షిక(23) తో 2017లొ వివాహం జరిగింది. కాగా.. వన్షిక ప్రతి విషయంలో భర్త పంకజ్ ని బంధువుల మందు అవమానించేంది. ఆ అవమానాలు వినీ వినీ విసిగిసోయిన పంకజ్.. భార్యను అంతమొందించాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన కో వర్కర్ నజీమ్ అహ్మద్(39)కి తెలియజేశాడు.

అతని సహకారంతో శనివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య పై దాడి చేశాడు. ముందుగా కారు వెంచర్ తో తలపై గట్టిగా బాదాడు. అనంతరం కత్తితో దాదాపు 40సార్లు కసితీరా భార్యను పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. వన్షిక తండ్రి మహేష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

భార్యను హత్య చేసినందుకు పంకజ్ ని.. అతనికి సహకరించినందుకు నజీమ్ అహ్మద్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.