Asianet News TeluguAsianet News Telugu

కమిట్మెంట్ అంటే అది..! ఛోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గిన దొంగ.. అవాక్కైన పోలీసులు... !!

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ దొంగ తన రూటే సపరేటు అని నిరూపించుకున్నాడు. కేవలం తన యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే ఐదు కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో  లక్షల రూపాయల చోరీ చేసి పరారయ్యాడు. కానీ పాపం..చివరికి తన ప్రయాస వృధా అయిపోయింది. పోలీసులకు చిక్కాడు. 

gujarat thief shed 10kgs weight to commit burglary, only one meal for three months
Author
Hyderabad, First Published Nov 19, 2021, 10:52 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అహ్మదాబాద్ : బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు... ఫిట్ గా ఉండాలని మరికొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ దొంగ మాత్రం దీనికి భిన్నం... కేవలం తననుకున్నది సాధించడానికి మూడే మూడు నెలల్లో 5 కిలోల బరువు తగ్గి .. అనుకున్నది సాధించాడు. అతను ఎందుకు ఈ పని చేశాడో.. అతని కమిట్మెంట్ ఏమిటో తెలిసే.. ముక్కు మీద వేలేసుకుంటారు.. 

గుజరాత్ లోని Ahmedabad లో ఓ వ్యక్తి కేవలం తన యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే ఐదు కిలోల బరువు తగ్గాడు.  పక్కా ప్రణాళికతో  లక్షల రూపాయల చోరీ చేసి పరారయ్యాడు. కానీ పాపం..చివరికి తన ప్రయాస వృధా అయిపోయింది. పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే…

Rajasthanలోని  ఉదయపూర్ కి చెందిన  మోతి సింగ్ చౌహాన్..  Gujaratలోని అహ్మదాబాద్లో మోహిత్ మరాడియా  అనే వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా పనిచేసేవాడు.  మూడేళ్ల కిందట అక్కడ పనిచేయడం మానేశాడు. అయితే, Mohit Maradia ఇంట్లో  భారీగా నగదు, నగలు ఉండడం గమనించిన...Moti Singh Chauhan  ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఇంటా బయట సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ చోటునుంచి ఇంట్లోకి చొరబడి అవకాశాలు ఉన్నాయి? అనే విషయాలను గమనించాడు.

చివరికి గాజు కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే CCTV cameraలో కనిపించదని తెలుసుకున్నాడు.  కానీ అతడు కాస్త లావుగా ఉండడంతో ఆ సన్నటి 
Window గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయింది.  దీంతో ఎలాగైనా ఆ కిటికీలోనుంచి దూరి Theft చేయాలని భావించిన మోతి సింగ్..  మూడు నెలల పాటు రోజుకు ఒక పూట ఆహారం తింటూ ఐదు కిలోల Weight loss అయ్యాడు. ఇక ఇప్పుడు తన శరీరం ఛోరీకి సహకరిస్తుందనుకున్నాడు. 

ఆవు పేడ తిన్న హర్యానా డాక్టర్.. తనువు, మనస్సు పవిత్రమవుతుందని వ్యాఖ్యలు.. వైరల్ వీడియో ఇదే

ఆ తర్వాత తన పాత యజమాని ఇంట్లో లేని సమయం కోసం ఎదురు చూశాడు. మోతీసింగ్ అనుకున్న రోజు రానే వచ్చింది. ఒకరోజు  owner కుటుంబంతో సహా.. ఎక్కడికో వెళ్లాడు. ఇంకేం.. ఇదే అదనుగా భావించి.. కిటికీ అద్దాన్ని పగలగొట్టి.. లోపలికి దూరి.. చోరీకి పాల్పడ్డాడు. మొత్తం రూ. 13.14 లక్షల విలువచేసే నగదు, నగలు  ఎత్తుకెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చాక అసలు విషయం తెలుసుకున్న యజమాని లబోదిబో మన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Victim ఫిర్యాదుతో  రంగంలోకి దిగిన పోలీసులు నేరస్తుడికోసం గాలించడం మొదలు పెట్టారు. అయితే,  గాజు కిటికీ ని పగలగొట్టడానికి ఉపయోగించిన పరికరాన్ని మోతి సింగ్ ఘటనా స్థలంలోనే వదిలేయడంతో దానిని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఆ పరికరం కొనుగోలు చేసిన దుకాణంలో వివరాలు లభించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేవలం దొంగతనం చేయడం కోసమే ఈ మూడు నెలల పాటు ఆహార నియమాలు పాటించి 5 కిలోల బరువు తగ్గడాని తెలిసి పోలీసులు షాక అయ్యారు. ఆ దొంగ కమిట్మెంట్ కు అవాక్కయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios