భర్తలను వదిలేసి ఇద్దరు మహిళల సహాజీవనం, చివరికిలా...

Gujarat lesbian couple jumps to death in Sabarmati river with baby
Highlights

ఇద్దరు మహిళల సహాజీీవనం

అహ్మదాబాద్: వివాహమై భర్తలు, పిల్లలున్న ఇద్దరు మహిళల మథ్య ప్రేమ పుట్టింది. భర్తలను వదిలేసి ఇద్దరు మహిళలు సహాజీవనం చేస్తున్నారు. అయితే ఈ సహాజీవనాన్ని సమాజం అంగీకరించని కారణంగా  వారిద్దరూ చిన్నారితో  సహా సబర్మతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.బావ్లా గ్రామానికి చెందిన ఆషాకు పదేళ్ల క్రితం పెళ్లి అయి ఇద్దరు కూతుళ్లున్నారు.బావ్లాకు సమీపంలోని రాజోడ గ్రామానికి చెందిన భావనకు. బావ్లా గ్రామంలోని ఓ పరిశ్రమలో కలిసి పనిచేస్తున్న ఆషా, భావనల మధ్య ప్రేమ పుట్టింది. 

ఈ ప్రేమ కారణంగా వీరిద్దరూ కూడ తమ భర్తలను వదిలేసి  కలిసి జీవించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ఇద్దరు కలిసే జీవనం సాగిస్తున్నారు. 

వీరిద్దరూ కలిసి జీవనం సాగించడం సమాజం అంంగీకరించలేదు. వీరిద్దరిని  సమాజం చిన్న చూపుచూస్తోంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం మేరకు వారిద్దరూ కూడ సబర్మతి నదిలో దూకారు. చనిపోయే ముందు ఆషా, భావనలో నది గట్టున లిప్‌స్టిక్ తో  తమ బాధను లేఖ రూపంలో రాశారు. తాము సహాజీవనం చేయడాన్ని సమాజం ఒప్పుకోవడం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు.

 

.ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడాలని భావించినట్టు చెప్పారు. చిన్నారి మేఘతో కలిసి వీరిద్దరూ కూడ నదిలో దూకారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికీ వారిద్దరూ కూడ మృతిచెందారు. చిన్నారి మేఘ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader