కోపంతో ఉన్న అమ్మవారు ఆవహించిందని.. పూనకం వచ్చిన మహిళను కొట్టి చంపారు
ఉత్సవాల్లో పాల్గొన్న rameelaకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. అది చూసిన అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న Exorcist రమేష్ సోలంకి ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడి ప్రజలను నమ్మించాడు.
అహ్మదాబాద్ : గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారకా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. Superstitionతో అమానుషానికి ఒడిగట్టారు. కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుంది అని భయపడే ఓ మహిళను అత్యంత దారుణంగా murder చేశారు.
ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి అనే మహిళ navratri 2021 ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం సమీపంలోని గ్రామానికి భర్తతో కలిసి వెళ్ళింది.
అయితే, ఉత్సవాల్లో పాల్గొన్న rameelaకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. అది చూసిన అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న Exorcist రమేష్ సోలంకి ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడి ప్రజలను నమ్మించాడు. మూఢ నమ్మకాలను సులువుగా నమ్మే జనాలు దీన్నీ అంతే ఈజీగా నమ్మేశారు.
అంతేకాదు, భూతవైద్యుడు చుట్టూ చేరి.. ఇంకా అతనేం చెబుతాడో అని వేచి చూడడం మొదలుపెట్టారు. దీన్ని అదనుగా తీసుకున్న భూతవైద్యుడు కోపంతో ఉన్న అమ్మవారిని పారద్రోలాలని… లేదంటే ఆమె అందరినీ చంపేస్తుంది అని భయపెట్టాడు. కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులతో సహా ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడిచేసిన ఇనుప చూపులతో రమీలాను చావ బాదారు.
దీంతో ఆమె తీవ్ర గాయాలతో గిలగిలలాడింది. దెబ్బలు తాళలేక మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కాగా, కరుడు గట్టిన రౌడీ షీటర్ దురై మురుగన్ చెన్నై ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కూటంపులి గ్రామంలో 39 ఏళ్ల వి. దురై మురుగన్ పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఈ సంఘటన శుక్రపారంనాడు జరిగింది. Durai Murugan మీద 35 కేసులున్నాయి. వాటిలో నాలుగు హత్య కేసులు కూడా ఉన్నాయి.
దురై మురుగున్ గతవారం టెంకసీ జిల్లాలో ఓ వ్యక్తిని చంపి శవాన్ని తిరునెల్వేలీలో పాతిపెట్టాడని, మురుగున్ ఈ కేసులో ప్రథమ ముద్దాయి అని, దాంతో దురై మురుగన్ ను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని తూత్తుకుడి పోలీసు సూపరిండెంట్ ఎస్ జెయకుమార్ చెప్పారు.
సింఘు బోర్డర్‌లో రైతు హత్య.. మరణించిన వ్యక్తి రోజు కూలీ, వివరాలివే
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.... పొట్టకల్కాడు ముత్తయ్యపురం గ్రామంలో దాక్కున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు అయితే, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కానిస్టేబుల్ మీద, ఎస్సైపై దురై మురుగన్ దాడి చేశాడు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
దురై మురుగన్ కు దోపిడీలు చేయడం అలవాటు. దోపిడీల సమయాల్లో హత్యలకు పాల్పడ్డాడు. వ్య్కతును చంపి శవాలను నిర్మానుష్యమైన ప్రదేశాల్లో పాతిపెడుతుంటాడు. టెంకసీకి చెందిన జగదీషన్ ను, ముదురైకి చెందిన మనిమొజిని, తూత్తుకుడికి చెందిన టి. సెల్వంను హత్య చేయడానికి కూడా అదే పద్ధతిని మురుగున్ పాటించాడు.
ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో దురై మురగన్ మరణించాడని Jeyakumar చెప్పారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారని, అయితే పదునైన ఆయుధంతో ఎస్పైపై, కానిస్టేబుల్ మీద దాడి చేశాడని చెప్పారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారని, దురై మురుగన్ అక్కడికక్కడే మరణించాడని ఆనయ చెప్పారు.