సింఘు బోర్డర్‌లో రైతు హత్య.. మరణించిన వ్యక్తి రోజు కూలీ, వివరాలివే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తోన్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన వేదిక వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో అన్నదాతలు, రైతు సంఘాల నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తోన్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన వేదిక వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో అన్నదాతలు, రైతు సంఘాల నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రకటన చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించిందని హర్యానా పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పోస్టుమార్టం జరుగుతోందని.. తమ వద్ద అనుమానితుల వివరాలున్నాయని చెప్పారు. త్వరలో అరెస్టు చేయబోతున్నాం అని ఆయన వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల సమయంలో దారుణ స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని గుర్తించామని.. ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించాం అని మరో అధికారి చెప్పారు.
కాగా, పోలీసు వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మృతి చెందిన వ్యక్తి పేరు లాఖ్‌బీర్ సింగ్... అతడు దళితుడని, ఎటువంటి నేర చరిత్ర లేదని తెలిపారు. అలాగే ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పారు. లాఖ్‌బీర్ సింగ్ పంజాబ్‌లోని చీమా కుర్ద్ ప్రాంతానికి చెందిన వ్యక్తని.. రోజుకూలీగా జీవించే అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారని అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం సింఘు ప్రాంతంలో ఓ దారుణ murder వెలుగులోకి వచ్చింది. మణికట్టు నరికేసి, చేతులు, కాళ్లకు కత్తిపోట్లు, బారికేడ్‌ను తలకిందులు చేసి దానికి వేలాడదీసి అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ dead body కనిపించింది. ఈ ఘటన వివరాలు తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని ఆరా తీశారు.
సిక్కుల వారియర్ గ్రూప్‌గా పేర్కొనే nihangs ఈ పనిచేసి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి. haryanaలోని సోనీపాట్ జిల్లా కుండ్లీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. హత్యకు గురైన వ్యక్తి చేతులు నరికేసినట్టు(chopped off)గా ఆ వీడియో చూపిస్తున్నది. రక్తం నేలపై పడుతున్నది. ఆయన కళ్లు నొప్పితో, షాక్‌తో మూసుకుపోతున్నాయి. ఆ సమయంలో కొందరు నిహంగ్స్ ఆయన చుట్టూ కనిపించారు. కొంతమంది ఈటెలు, ఇతర ఆయుధాలు పట్టుకుని ఆ బాడీ చుట్టూ తిరుగుతున్నట్టు వీడియో చూపించినట్టు ఓ కథనం పేర్కొంది. ఆయన పేరు, స్వగ్రామం వివరాలను ఆ నిహంగ్స్ అడుగుతున్నట్టు వీడియోలో వినిపించిందని వివరించింది. అయితే, అక్కడున్న వారిలో ఒక్కరూ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయలేదని తెలిపింది.