Viral video: ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద ఒకరినొకరు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

Viral video: వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్లే తరచుగా తగాదాలు ఏర్పడతాయి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. చినికి చినికి గాలివానైనట్లు.. చిన్న వివాదం.. పెద్ద గొడవకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి గొడవలే ప్రాణాంతకంగా మారుతాయి. సాధారణంగా చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవపడి.. నానా బీభత్సం సృష్టిస్తారు. ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కామన్ గా అబ్బాయిలు రోడ్లపై గొడవ పడటం.. వీధి రౌడీల్లా కొట్టుకోవడం చూసి ఉంటాం.. తాజాగా కొందరూ అమ్మాయిలు కూడా అలానే వ్యవహరిస్తోన్నారు. తాము కూడా వీధి పోరాటాలకు వెనకడమంటూ.. ముందుకు వస్తున్నారు. ఎవరైనా చూస్తే.. ఏమనుకుంటారు అనే ఆలోచన లేకుండా.. జట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. నడిరోడ్డుపై ఆడ రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, బట్టలు చింపుకుంటూ మరీ కొట్టుకుంటున్నారు. రోడ్డు మీద ఉన్నాం.. పది మంది చూస్తున్నారనే సోయి మరిచి వ్యవహరించారు. ప్రస్తుతం ఆ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాజ్ కోట్ లో ఇద్దరు యువతులు నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఏ విషయంలో వారి మధ్య గొడవ ప్రారంభమైందో తెలియదు గానీ, ఆ ఇద్దరూ యువతులు మాత్రం దారుణంగా కొట్టుకున్నారు. వారిద్దర్ని ఆపడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. కానీ.. ఫలితం లేకుండాపోయింది. వారు మాత్రం తగ్గేదేలే అంటున్నట్టుగా ఒక్కరిపై ఒక్కరూ పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఓ అమ్మాయి అయితే.. తన చేతి గోర్లతో మరో అమ్మాయి మొఖంపై రక్కడం వీడియోలో చూడవచ్చు. ఈ గొడవ చాలా దారుణంగా జరిగింది. 

చూడటానికి ఆ ఇద్దరు యువతులు మంచిగానే చదువుకున్నట్టు కనపిస్తున్నారు. కానీ వారి వీధిపోరాటం చూస్తే.. అసలు వీళ్లు ఆడవాళ్లనే అనే సందేహం కూడా వస్తుంది. వారి ఫైటింగ్ చూసి.. చుట్టూపక్కల వారు నివ్వెరపోయి చూడటం వారి వంతైంది. మొత్తం మీదనైతే.. అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే.. అమ్మాయిలు కూడా అన్ని విషయాల్లో అబ్బాలతో పోటీ పడగలరని అర్థమవుతుంది.

Scroll to load tweet…