ప్రేమించానని మాయ మాటలు చెప్పాడు. అతను చెప్పినవన్నీ నిజమేనని నమ్మింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. కాబోయే వాడే కదా అని ఆ యువతి కూడా తొందర పడింది. అయితే... వారిద్దరి మధ్య రొమాన్స్ ని అతను వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన యువతి భరించలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఛాహరానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Also Read కరోనా భయం... గుడిలో దేవుడి విగ్రహాలకు మాస్క్ లు...

పూర్తి వివరాల్లోకి వెళితే... ఛాహరానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించారు. పెళ్లి కూడా  చేసుకోవాలని అనుకున్నారు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించారు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు.

అలా శారీరక సుఖం పొందుతున్న సమయంలో యువకుడు దానిని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోలను సదరు యువకుడు తన స్నేహితులతో పంచుకున్నాడు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.

ఈ విషయం తెలిసిన యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది. అంతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా.. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ప్రియుడిని.. అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.