Asianet News TeluguAsianet News Telugu

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ‘తీవ్రవాది’గా పేర్కొన్న గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే..

గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ ఆర్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ‘తీవ్రవాది’గా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. తరువాత ఆ పోస్టును డిలీట్ చేశారు. తప్పుగా ట్రాన్స్ లేేట్ అయ్యిందని, క్షమాపణలు కోరారు. 

Gujarat BJP MLA calls Netaji Subhash Chandra Bose an 'extremist'
Author
First Published Jan 24, 2023, 8:52 AM IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను సోమవారం దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా నేతాజీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తమ పోస్టుల ద్వారా బోస్ ను గుర్తు చేసుకున్నారు. అయితే గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సుభాష్ చంద్రబోస్ ను ‘తీవ్రవాది’గా పేర్కొన్నారు. తరువాత తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పారు.

ఛీ.. కదులుతున్న కారుపై ప్రేమజంట చేస్తున్న పనికి.. మండిపడుతున్న నెటిజన్లు..

గుజరాత్‌లోని ఆనంద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగేష్ ఆర్ పటేల్ (బాప్జీ) సోమవారం ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. నేతాజీ ‘‘ఆటంక్‌వాడి’’ (ఉగ్రవాద) విభాగానికి చెందిన సభ్యుడిగా పేర్కొన్నాడు. కొంత కాలం తరువాత తేరుకున్నారు. క్షమాపణలు చెబుతూ, తప్పుగా ట్రాన్స్ లేట్ అయ్యిందని తెలిపారు. ఇంగ్లీషు నుంచి గుజరాతీలోకి అనువదించే సమయంలో పొరపాటు జరిగిందని, తప్పుడు పదాలు చేరాయని ఆయన స్పష్టం చేశారు. 

విచిత్రం... వరుడు రూ.10 నోట్లను లెక్కించలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు...

‘‘ బోస్ ఆటంక్‌వాడి (వింగ్) సభ్యుడు. అతను కాంగ్రెస్ నాయకుడిగా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. సోషలిస్ట్ విధానాలను సమర్థించడంలో పేరుగాంచాడు” అని పటేల్ తన ఫేస్‌బుక్ పేజీలో గుజరాతీలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అయితే కొంత మంది ఈ లోపాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే కు తెలియజేశారు. వెంటనే ఆయన ఈ పోస్ట్ ను తొలగించారు. కానీ ఆ పోస్ట్ ను అప్పటికే అనేక మంది గమనించారు. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను విమర్శించింది. క్షమాపణల చెప్పాలని డిమాండ్ చేసింది. 

సిఆర్‌పిఎఫ్, బీహార్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. భారీ మొత్తంలో పట్టుబట్ట ఆయుధాలు, మందుగుండు సామాగ్రి..

‘‘ సుభాష్ చంద్రబోస్‌ను ఎమ్మెల్యే యోగేష్‌ ఉగ్రవాదిగా అభివర్ణించారు. దీనిని నేను ఖండిస్తున్నాను. ఆ పోస్ట్‌ను తొలగిస్తే సరిపోదు. పొరపాటున పోస్ట్ చేసినా పటేల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అని గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఇసుదన్ గాధ్వి అన్నారు. దీనిపై అనేక మంది విమర్శలు చేయడంతో ఎమ్మెల్యే పటేల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ ఇంగ్లీష్ నుంచి గుజరాతీకి అనువాదం చేయడంలో లోపం జరిగింది. అందుకే తప్పుడు పదాలు పోస్ట్ అయ్యాయి’’ అని పేర్కొన్నారు.

 

‘‘ నా ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తి గుజరాతీ భాషలో రాసిన కంటెంట్ ను ఆన్‌లైన్ ట్రాన్స్ లేట్ ద్వారా ఇంగ్లీష్ లోకి మార్చారు. ఆ కంటెంట్ ను తీసుకొచ్చి నా పేజీలో ఉంచారు. పొరపాటున తప్పు పదాన్ని ఎంచుకుని పోస్ట్ చేశారు. ఈ పొరపాటుకు నేను క్షమాపణలు కోరుతున్నాను’’ అని ఎమ్మెల్యే  యోగేష్ ఆర్ పటేల్ పేర్కొన్నట్టు ‘పీటీఐ’ నివేదించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios