ఛీ.. కదులుతున్న కారుపై ప్రేమజంట చేస్తున్న పనికి.. మండిపడుతున్న నెటిజన్లు..
లక్నోలో ఓ జంట కదులుతున్న కారు టాప్ మీద రొమాన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లక్నో : శృంగారం, రొమాన్స్.. ఓ అందమైన వ్యక్తిగత అనుభవం. దాన్ని బజార్లోకి తీసుకువస్తున్నారు నేటి యువత. మొదట విశాఖలో, ఆ తరువాత లక్నోలో ప్రేమికుల జంటలు బైక్ మీద వెడుతూ రొమాన్స్ చేయడం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు వీటిమీద కేసులు నమోదు చేసి.. ఆ జంటల మీద దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే ఇలాంటి మరో ఘటన తాజాగా, లక్నోలోనే వెలుగు చూసింది. అయితే, ఈ సారి కారు టాప్ మీద జంట పిచ్చిపనికి పూనుకున్నారు.
వివరాల్లోకి వెడితే.. మోటారు సైకిళ్లపై జంటలు రొమాంటిక్‌గా వెడుతున్న వీడియోలు ట్రెండ్ అయిన క్రమంలోనే.. లక్నోలోని మరో వీడియో క్లిప్ మళ్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో హల్ చల్ చేస్తోంది. ఇక్కడ ఒక జంట ఒక అడుగు ముందుకు వేసి, కదులుతున్న కారుపై ఒకరికొకరు ముద్దులు పెడుతూ, రొమాన్స్ చేస్తూ కనిపించింది.
రోడ్డుమీద స్కూటీపై లవర్స్ పాడు పని! వీడియో వైరల్ .. రంగంలోకి దిగిన లక్నో పోలీసులు..
వైరల్ క్లిప్‌ను ప్రియా సింగ్ అనే ఇంటర్నెట్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆమె హిందీలో బైక్‌ల తర్వాత, కదులుతున్న కారులో బహిరంగ ప్రేమ అని పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇంతకు ముందు, వ్యక్తులు స్కూటీకి సంబంధించిన ఇలాంటి వీడియో గుర్తుంది కదా... స్కూటీమీద ఆ యువజంట చేసిన పనే ఇప్పుడు వీరు కారు టాప్ మీద చేస్తున్నారు. లక్నోలోని రోడ్ల పరిస్థితిని చూడండి అంటూ.. ఆమె తన క్యాప్షన్‌లో జోడించింది.
వీడియోలో, కదులుతున్న సెడాన్‌లో.. హ్యుందాయ్ వెర్నాలాగా అనిపిస్తుంది. ఆ కారులో ఉన్న జంట, వాహనం కదులుతున్నప్పుడు సన్‌రూఫ్ నుండి బయటకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు. వీడియోలో కాసేపటి తరువాత.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఇదంతా వీడియో తీస్తున్నారని తెలుసుకున్న తర్వాత వీరిద్దరూ కారులోకి వెళ్లిపోయినట్లుగా అనిపిస్తోంది. అయితే, రోడ్డు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు వీరిపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది ఇంకా ధృవీకరించబడలేదు.
ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో షేర్ చేయబడినప్పటి నుండి, చాలా తక్కువ సమయంలో చాలా వ్యూస్, లైక్‌లు, రీషేర్‌లు అయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వరద పారిస్తున్నారు. ఇలాంటి యాక్టివిటీ చేయడం సరదా కాదని, దాని వల్ల పెద్ద ప్రమాదం జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఒకరు వ్యాఖ్యానించారు. లైక్‌లు, కామెంట్‌ల కోసం.. వైరల్ అవ్వడం కోసం ఈ రోజుల్లో జీవితాలతో ఆడుకోవడానికి కూడా వెనకడాడడం లేదని.. మరొకరు రాశారు. మూడో యూజర్ యూపీ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి, దీనిపై చర్య తీసుకోవాలని కోరారు.