Asianet News TeluguAsianet News Telugu

చిరువ్యాపారులను ఇటుకలతో కొట్టిన సెక్యూరిటీ గార్డులు.. ఇండియా గేట్‌ వద్ద ఉద్రిక్తత..

నో-వెండింగ్ జోన్‌లో ఉన్న ఇండియా గేట్  వద్ద చిరువ్యాపారులను తొలగించే క్రమంలో.. వారిమీద ఇటుకలతో దాడి చేశారు. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Guards Thrash Food Vendors At India Gate During Clash Over Sale Ban in delhi
Author
First Published Jan 4, 2023, 1:57 PM IST

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది చిరు విక్రేతలను ఇటుకలతో కొట్టారు. ఈ దాడికి సంబంధిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద పునరుద్ధరించబడిన హైసెక్యూరిటీ ఏరియాలో తినుబండారాలు విక్రయించడాన్ని నిషేధించారు. అయితే, నిషేధిత ఏరియాలో అమ్మకాలు చేస్తున్నవ్యాపారులు సెక్యూరిటీ గార్డులతో గొడవపడ్డారు. దీంతో వారిని ఈడ్చుకెళ్లి ఇటుకలతో కొట్టడం షాకింగ్ కలిగించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా గేట్ పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. ఇండియా గేట్ నో-వెండింగ్ జోన్‌లో ఉందని, ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయమని గార్డులు విక్రేతలను కోరారని పోలీసులు చెబుతున్నారు. నో-వెండింగ్ జోన్‌లో ఉన్న దుకాణాలను తీసేయడానికి న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్‌డిఎంసి)కి చెందిన ట్రక్కును తీసుకొచ్చారు. అది చూసిన చిరువ్యాపారులు గార్డులపై కర్రలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. కొంతమంది విక్రేతలు గార్డులపైకి అందుబాటులో ఉన్న భవన నిర్మాణ సామగ్రిని కూడా విసిరారు. ఈ సంఘటనలో ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

షెడ్యూల్ కంటే ముందుగానే త్రిపుర ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఎన్నిక‌లపై పార్టీనేత‌లో చ‌ర్చ‌లు !

ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఈ గార్డులు రాజధానిలో ప్రధాన పర్యాటక ఆకర్షణలలో స్మారక చిహ్నం సమీపంలో ఉన్న ప్రాంతంలో భద్రతను కాపాడే బాధ్యతను నిర్వహిస్తారు. వైరల్ అయిన విజువల్స్‌లో, గార్డులు విక్రేతల దుకాణాలను కూల్చివేయడానికి ప్రయత్నించారు. దుకాణదారులు అక్కడినుంచి వెళ్లడానికి నిరాకరించారు. దీంతో వారిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపించడానికి గార్డులు పూనుకున్నారు. 

ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసే క్రమంలో గార్డులు ఒక చిరువ్యాపారిని ఎత్తుకెళ్లడం కనిపిస్తుంది. మరొక విజువల్ లో ఇద్దరు గార్డులు ఓ వ్యాపారిని కొట్టడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, గార్డులలో ఒకరు ఇటుకతో వ్యాపారి తల మీద కొట్టాడు. దెబ్బల నుండి ఒకరినొకరు రక్షించుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఇండియా గేట్ చూడడానికి వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు.

చిరువ్యాపారులమీద రాళ్లు, ఇటుకలతో హత్యాయత్నానికి పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ పని ప్రారంభానికి ముందు ఇండియా గేట్‌ వద్ద చిరుతిళ్లు అమ్మే విక్రేతలు, రకరకాల యాంగిల్స్ లో ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్లు, మెరిసే లైట్లతో పిల్లల బైక్‌లు నడపడం లాంటి దృశ్యాలు సుపరిచితంగా ఉండేవి. స్మారక చిహ్నం వద్ద ఉన్న ఐస్ క్రీం స్టాల్స్ అర్థరాత్రి వరకు తెరిచి ఉండేవి. ఢిల్లీ వాసులు అర్థరాత్రులు డెజర్ట్స్ కోసం ఇక్కడికి వస్తుండేవారు. 

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పని ప్రారంభమైన తర్వాత ఇందులో చాలా వరకు మార్పు వచ్చింది. ఆ ప్రాంతంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విక్రయదారులు ముందుగానే తమ దుకాణాలు వేరే చోటుకు మార్చుకోవాలని కోరారు. ఆ ప్రాంతం నుండి పంపించేయబడ్డారు. పౌరసరఫరాల సంస్థ ఎన్‌డిఎంసి విక్రయదారులకు కేటాయించిన మండలాల్లో స్థలాలు కేటాయిస్తామన్నారు. పునరుద్ధరణ తర్వాత ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు పౌర సంఘం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios